//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్ కళ్యాణ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. సొంత‌గా మీడియా ఛానల్ ఏర్పాటు..!

Category : politics

ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్యంగా దూసుకువ‌చ్చిన‌ జనసేన.. 2014లో కేంద్రంలో బీజేపీకి.. ఏపీలో టీడీపీకి మ‌ద్ధ‌తు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. అయితే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌ధ్యంలో జ‌న‌సేన.. రాష్ట్రంలో టీడీపీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇక సొంత‌గా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగుతామ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో జ‌గ‌న్ యాత్ర కూడా చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే ప‌వ‌న్ యాత్ర‌కు మీడియాలో క‌వ‌రేజ్ పెద్ద‌గా లేక‌పోవ‌డంతో ప‌వ‌న్ యాత్ర చ‌ప్ప‌గా సాగడ‌మే కాకుండా పెద్ద‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్ళ‌లేదు.

దీంతో ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుండ‌డంతో.. పవన్ కళ్యాణ్‌కి ఇప్పుడు పబ్లిసిటీ చాలా ముఖ్య‌మ‌ని భావించి.. ఒక కొత్త టీవీ ఛానల్ పెట్టె పనిలో ఉన్నార‌ని టాక్. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ పక్కన ఉన్న ఒక ప్రముఖ చానల్‌ను మూడేళ్ళ పాటు లీజుకు తీసుకుంటునట్టు సమాచారం. అందుకుగానూ.. సదరు యాజమాన్యానికి దాదాపుగా ౩౦౦ కోట్లు ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ విష‌యం పై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ప‌వ‌న్ ఓ కొత్త చాన‌ల్‌ను కూడా పెట్టే ప‌నిలో ఉన్నాడ‌ని స‌మాచారం. ఓ ప్ర‌ముఖ ఎన్నారై స‌హాయంతో త్వ‌ర‌లోనే ప‌వ‌న్ కొత్త చాన‌ల్ ఏర్పాటు చేయ‌నున్నార‌ని.. ఇటీవ‌ల ఆ ఎన్నారై తెలుగులో ఓ చిత్రాన్ని కూడా నిర్మించగా.. ప‌వ‌న్ ఆ సినిమా ఆడియో ఫ‌క్ష‌న్‌కు కూడా వెళ్ళారు. దీంతో ప‌వ‌న్ త్వ‌ర‌లోనే ఓ కొత్త చాన‌ల్ స్టార్ట్ చేయ‌డం ఖాయ‌మ‌ని జ‌న‌సేన వ‌ర్గీయులు నుండి కూడా ఓ వార్త లీక్ అయ్యింది. మ‌రి రానున్న ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌కు ఆ చాన‌ల్ ఎలా ఉప‌యోగ ప‌డుతుందో చూడాలి.