//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కౌశల్ కి సపోర్ట్ గా పవర్ స్టార్ ఫ్యాన్స్....!

Category : movies

బిగ్ బాస్ లో స్టాంగ్ కంటెస్టంట్ లో ఒకరైన కౌశల్ కు మొదట్లో మాములుగా అనిపించినా తర్వాత తర్వాత తన పొటెన్షియాలిటీ చూపిస్తూ ఎలాంటి సందర్భంలో అయినా ఒకే విధంగా ఉంటూ తన సత్తా చాటాడు. అందుకే బయట ఓ సగటు హీరోకి వచ్చిన ఫాలోయింగ్ వచ్చింది.


అంతేకాదు కౌశల్ కోసం ఫ్యాన్స్ పెరిగి కౌశల్ ఆర్మీగా తయారయ్యి బిగ్ బాస్ ఎలిమినేషన్స్ ను డిసైడ్ చేస్తున్నారు. అంతేకాదు కౌశల్ కే టైటిల్ వచ్చేలా వారు కృషి చేస్తున్నారు. గీతా మాధురి కౌశల్ ను సీజన్ మొత్తం ఎలిమినేట్ చేసినా సరే ప్రతి వారం అతన్ని ఎలిమినేట్ కాకుండా చేస్తున్నారు.

ఇక ఇదిలాఉంటే కౌశల్ ఆర్మీ వెనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారని అంటున్నారు. సేమ్ పవన్ ఫ్యాన్స్ లానే మిగతా ఇంటి సభ్యుల మీద నెగటివ్ ట్రోల్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. అయితే కౌశల్ ఆర్మీకి ఆ ట్రోల్స్ కు ఎలాంటి సంబంధం లేదని కొందరి వాదన.

కౌశల్ ఆర్మీ మీద నెగటివ్ ఇంప్రెషన్ కలిగించడానికి కొందరు కావాలని అలా చేస్తున్నారని అంటున్నారు. ఈమధ్యనే పవన్ ఫ్యాన్స్ ఉన్మాదులు అన్న కత్తి మహేష్ కొత్తగా ఇప్పుడు కౌశల్ ఆర్మీ మీద పడ్డాడు.

కౌశల్ ఆర్మీవి ఉన్మాదపు చర్యలంటూ కత్తి ఎటాక్ చేస్తున్నాడు. మరి కౌశల్ ఆర్మీలో పవర్ స్టార్ ఫ్యాన్స్ శాతమెంతో తెలియదు కాని కౌశల్ ఆర్మీ మాత్రం అంతటా సంచలనంగా మారుతుంది.

#Biggboss2 #telugubiggboss #Kaushalarmy #kaushal #pawanfans #Pawankalyan