//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్వరలో బీజేపీ లోకి పవన్..

Category : politics

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బీజేపీ లో కలవనున్నాడా? అవునననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గతంలో చిరంజీవి కూడా తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి మనకి తెలిసిందే. తన అన్న చిరంజీవి చేసిన పనికి అయన అభిమానులు, తన సామజిక వర్గం ఇప్పటికి కోలుకోలేదు. ఇప్పడు అదే తప్పుని పవన్ చేస్తున్నాడు అంటూ రాజకీయవర్గాల నుంచి విస్వసనీయ సమాచారం.

పవన్ ఇప్పుడు పోలవరం ప్రాంతాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటివరకు అధికార టీడీపీతో ఉండి ఇప్పుడు ఆ పార్టీపై విమర్శలు చేస్తున్నాడు పవన్. కానీ ఇటు బీజేపీని కానీ అటు వైస్సార్ సీపీని కానీ ఒక్క మాటకూడా అనటంలేదు. దీనికి కారణం 2019 ఎలక్షన్స్ లో బీజేపీ, జనసేన, వైస్సార్సీపీ ఈ మూడు పార్టీలు మహాకూటమిగా ఏర్పడి పోటీచేస్తాయని అనుకుంటున్నారు. కానీ జగన్ ఈ విషయంపై ఇంకా స్పష్టతకు రాలేదని వినిపిస్తుంది.

ఒకవేళ జగన్ మహాకూటమిలో కలవకపోయిన, పవన్ తన పార్టీని బీజేపీ లో విలీనం చేసి ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా నిలబడుతున్నాడనే వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. బీజేపీ అధికార కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రేత్యేక హోదా ఇస్తానని ఇవ్వకపోవడం, పైగా రావలిసిన నిధులు ఇవ్వకపోవడంతో తో ఏపీ ప్రజలు తీవ్ర కోపంతో ఉన్నారు. దీనితో ఏపీలో బీజేపీ కి ఒక్క సీటు కూడా రాదని అంటున్నాయి కొన్ని సర్వేలు. అదే విధంగా పవన్ సభలకి జనం వస్తున్నా, అయన ఎంత ప్రచారం చేసిన ఒక్క సీటు కూడా రాదని తాజా సమాచారం. 2019 ఎలక్షన్స్ లో టీడీపీ, వైస్సార్ సీపీ మధ్యనే పోటీ ఉంటుందని సమాచారం. అయితే పవన్ బీజేపీ లో ఎప్పుడు కలుస్తాడనేది తెలియాలంటే ఈ డిసెంబర్ వరకు ఆగాలసిందే.

Related News