//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణ లో పవన్ మద్దతు ఎవరికీ ....పార్టీ అభిప్రాయాన్ని 5న తెలియజేస్తాన్న పవన్ కల్యాణ్ !

Category : politics

తెలంగాణ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధోరణి ఎలా ఉంది . ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చెయ్యడం లేదని, అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన మద్దతు ఎవరికి ఇస్తుందన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వకుండా దాటవేస్తున్నాడు .

ఎంత దాటవేసినా అభిమానులు, రాజకీయ పార్టీ నేతలు మాత్రం మద్దతుపై పవన్ ను ప్రశ్నిస్తుండడం తో అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తూ పవన్ తెలంగాణ ఎన్నికల్లో తన మద్దతు ప్రకటించేందుకు రెడీ అయ్యారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మిత్రులు, జనసైనికులు, ప్రజలతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పార్టీ అభిప్రాయాన్ని తెలియజేయమని కోరుతున్నారు. జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5వ తారీఖున తెలియపరుస్తాము అంటూ పవన్ ట్వీట్ చేశారు.

ఇక పొతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ మహాకూటమికి మద్దతు తెలిపే అవకాశం కొంచెం కూడా లేదు . అలాగే మరోపక్క బీజేపీ పై కూడా నిప్పులు చెరుగుతున్నాడు . ఎలాంటి సమయం లో తెరాస కి మద్దతు తెలిపే అవకాశం ఉంది అని అందరూ చర్చించుకుంటున్నారు . డిసెంబర్ 5న పవన్ అభిప్రాయం ఏమై ఉంటుంది ఏ పార్టీకి మద్దతు ప్రకటిస్తారు అన్న దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .

Related News