//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కలవనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Category : politics

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చాలా రోజుల తరువాత ఒకే వేదికపై కలవనున్నారు. ఈ రోజు గుంటూరు సమీపంలో జరగనున్న దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇద్దరు నేతలూ హాజరుకానున్నారు.

ఈ ఉదయం 11 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ దగ్గర ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది.

ఇక్కడి లింగమనేని టౌన్ షిప్ పక్కనే ఈ నూతన దేవాలయ నిర్మాణం ఇటీవల పూర్తయింది. మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కానున్నారు. మొత్తం నాలుగు ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించగా, గుడిలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇండియాలో దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహమున్న తొలి దేవాలయం ఇదే కానుంది.