//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హైప‌ర్ ఆదికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోన్‌..!

Category : politics

హైప‌ర్ ఆది ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు ఎప్ప‌టిక‌ప్పుడు భ‌జ‌న చేసే వ్య‌క్తి అన్న విష‌యం అంద‌రికీ తెలుసు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానిగా కాస్తంత లాజిక్ లెస్‌గా మాట్లాడుతుంటాడ‌ని అంద‌రూ అంటుంటారు. అయితే, హైప‌ర్ ఆది మీద ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటీవ‌ల సీరియ‌స్ అయ్యాడ‌ని, అంతేకాకుండా, వార్నింగ్ కూడా ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు.

ఇక స‌లు విష‌యానికొస్తే.. జ‌న‌సేన పార్టీని అధికార పీఠాన్ని ద‌క్కించుకుంటే ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌ట్టిగానే ఒంట‌రిగానే ఎదిరిస్తున్నారు. ఆయ‌న ఒక్క‌రే జ‌న‌సేన‌కు అన్నీ అయిపోయారు. అలాంటి స‌మ‌యంలో జ‌నసేన పార్టీకిహైప‌ర్ ఆది కొత్త ఫార్ములాను అందిస్తున్నాడు. త‌మ నేత‌గ‌నుక సీఎం అవ్వాలంటే ఒక ప‌వ‌ర్‌ఫుల్ ఫార్ములా రోఎడీ చేశాన‌ని చెప్తున్నాడు. ఆ సూత్రాన్ని పాటిస్తే ప‌వ‌న్ క‌ళ్యాన్ క‌చ్చితంగా సీఎం అయిపోతాడ‌ట‌. హైద‌రాబాద్‌లో జ‌రిగిన జ‌న‌సేన ఐటీసెల్ స‌మావేశంలో ఈ విష‌యాన్నివెల్ల‌డించాడు.

నెక్ట్స్ సీఎం ఎవ‌రు అని వాట్సాప్ గ్రూప్, ఫేస్‌బుక్ లాంటి పేజీల‌ను క్రియేట్ చేసి అందులో నెక్స్ట్ సీఎం ఎవ‌రు అని పోస్టులు పెట్టాల‌న్నారు .ఎనిమిది నెల‌ల త‌రువాత ఆ గ్రూప్‌ప‌వ‌న్ క‌ళ్యాణే సీఎం అని ప్ర‌తీ ఒక్క‌రు చెప్పేలా ఆ గ్రూప్ మారిపోతుంద‌న్నారు. అలాగే, ఇంట్లో వాళ్ల‌ను సైతం ప్ర‌భావితం చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు హైప‌ర్ ఆది సూచించాడు. గ్రామ స‌భ‌లు, అలాగే, ఈవెంట్లు అంటూ హైప‌ర్ ఆది స‌ల‌హాలు ఇచ్చాడు. ఈ స‌ల‌హాలు త‌న అనుచ‌రుల ద్వారా తెలుసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాన్ హైప‌ర్ ఆదికి ఫోన్ చేసి సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. ఇవ‌న్నీ జ‌న‌సేన పార్టీ మొద‌ట్నుంచే చేస్తుంద‌ని, పాత స‌ల‌హాల‌నే కొత్త‌గా ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌వ‌న్ క‌ళ్యాన్ హైప‌ర్ ఆదిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.

Related News