//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్ కీలక ప్రకటన...!

Category : politics

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీ ఈ రోజు సుదీర్ఘముగా భేటీ అయ్యారు. ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ కమిటీ తేల్చిన విషయాలను మీడియా ద్వారా ప్రజలకు చెబుతున్నాడు.

కేంద్రం ఏపీ కు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి, స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు.స్పెషల్ ప్యాకేజీ తో కొత్తగా వచ్చే లాభం ఏమిలేదని చెప్పారు . స్పెషల్ స్టేటస్ ఇస్తే బాగుంటుందని చెప్పారు.

ఈ సమావేశం లో నిర్ణయాలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ. 20 వేల కోట్లు కేంద్రం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు , అలాగే 10వ షెడ్యూల్‌లోని ఉమ్మడి ఆస్తులను సమానంగా పంచాలని జేఎఫ్‌సీ డిమాండ్ చేస్తుందని చెప్పారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ 11 అంశాలను జేఎఫ్‌సీ గుర్తించిందని చెప్పారు.పోలవరాన్ని సకాలంలో పూర్తీ చేయాలనీ చెప్పారు. పోలవరం ముందుకు పోకపోతే రాష్ట్ర ప్రభత్వానిదే భాద్యత అని గుర్తు చేసారు. విశాఖకు రైల్వే జోన్ ను కేంద్రం ప్రకటించాలి అని అయన చెప్పుకొచ్చారు. అలాగే దుగ్గరాజుపట్నం పోర్ట్ కుదరక పొతే రాష్ట్రము లో వేరొక చోట పోర్ట్ కు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేసారు.

కేంద్రం నుండి రాష్ట్రానికి ఇంకా ఏడు 75 వేల కోట్లు రావలిసింది ఉంది అని పవన్ చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధుల ఫై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపించాలని భాద్యత ఉన్నదని చెప్పారు. అలాగే అమరావతి గ్రీన్ ఫీల్డ్ కాపిటల్ అని జెపి అన్నారు.కాపిటల్ కు నిధులు ఇవ్వవలిసిన భాద్యత కేంద్రానిదే అని జెపి తెలియజెప్పారు.

అలాగే కొందరు నాయకులు నన్ను టీడీపీ కు పాట్నర్ గా మాట్లాడుతున్నారని,నేను టీడీపీ కు పాట్నర్ కాదు అని,ఎన్నికల సమయం లో టీడీపీ ఇచ్చిన హామీలు బాగున్నాయి, చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడని టీడీపీ కు మద్దతు తెలిపానని అయన వివరించారు.ఇప్పుడు చంద్రబాబు కూడా వేరే ధోరణితో మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ వివరించారు.