//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'దేశ సమగ్రతను కాపాడలేకపోతే వేర్పాటు ఉద్యమాలకు ఊపిరి పోసినట్టే' :పవన్ ట్విట్.

Category : national politics

ఆదివారం 'హిందీ గో బ్యాక్' అంటూ ఒక పత్రికలో వచ్చిన ఒక కథనానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధీటుగా సమాధానం ఇచ్చారు.మన భాష, జాతి, సంస్కృతులను కేంద్రం గౌరవించలేక పోతే, మన దేశ సమగ్రతను కాపాడలేకపోతే వేర్పాటు ఉద్యమాలకు ఊపిరి పోసినట్టే అవుతుందని ఆదివారం ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. అంతకుముందు ఉత్తరాది పెత్తనం దక్షణాది ప్రజల మీద చూపవద్దుంటు కూడా పవన్ పేర్కొన్నాడు.

హిందీ భాషను బలవంతంగా దక్షిణాది రాస్ట్రాలపై రుద్దాలని చూడటం సరికాదని కేంద్రానికి పవన్ హితవుపలికారు. మంత్రులు, పార్టీ నేతలంతా ఇకపై హిందీలోనే మాట్లాడాలంటూ ప్రధాని మోదీ చేసిన సూచన నేపథ్యంలో 'హిందీ గో బ్యాక్' అంటూ ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని పవన్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఉత్తరాది నాయకులు ఇకనైనా పరిస్థితులను అర్థం చేసుకుని దేశంలోని భిన్నసంస్కృతులు, సంప్రదాయాలను గౌరవించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరాడు.