//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ ఫై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!

Category : politics

ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ...

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో పార్లమెంటులో మన్మోహన్ సింగ్ ప్రకటించారని,వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని సినీనటుడు,జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.అప్పట్లో తెలంగాణ కోసం అందరూ కలిశారని,లోక్‌సభను స్తంభింపజేశారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలను సాధించేందుకు ఓ వేదిక ఉండాలని నిర్ణయించానని తెలిపారు.మాజీ మంత్రి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌,లోక్ స‌త్తా జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ లాంటి వారిని క‌లుసుకుని ముందుకు వెళతానని చెప్పారు.

ఉండ‌వ‌ల్లి,జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణలను తాను వ్యక్తిగతంగా కలుస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.జ‌న‌సేన గొంతు స‌రిపోవ‌డం లేదని చెప్పారు.కేంద్ర,రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెప్పేవాటిలో అస‌త్యాలు ఉన్నాయని చెప్పారు.తాను రేపటి బంద్‌కు వ్యతిరేకం కాదని,కాకపోతే శాంతి యుతంగా నిరసనలు జరపాల్సి ఉందని చెప్పుకొచ్చారు.బంద్‌ల పేరుతో మనవాళ్లని మనం ఇబ్బందులకు గురిచేయడం సరికాదని చెప్పారు.