//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బి.జె.పి కి దిమ్మదిరిగే కౌంటరిచ్చిన పవన్ కల్యాణ్

Category : politics national

బి.జె.పి ఎం.పి తరుణ్ విజయ్ అనే పెద్దాయన ఈ మద్య ఓ చర్చలో మాట్లాడుతూ మాకు జాత్యహంకారం లేదు..అలా ఉంటే నల్లగా ఉండే సౌతిండియన్లతో ఎలా ఉంటామంటూ కామెంట్ చేశాడు. దీనిపై ఇప్పుడు దేశమంతా తమ ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు జనం. అసలు దేశాన్ని ఇలా ఎందుకు విడదీసి చూస్తారు..సారీ చెప్తే సరిపోయే తప్పు కాదు పెద్ద అవమానం ఇది అంటూ నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్లో మండిపడ్డాడు..ఎప్పటికప్పుడు దేశంలో రాష్ట్రంలోని పరిణామాలపై ట్వీట్లతో స్పందించే పవన్ కల్యాణ్ ఇప్పుడు తాను ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన బిజెపిపైకి నేరుగా విమర్శలు ఎక్కుపెట్టడమే ఇందులో విశేషం.

ఐతే ఎప్పటిలాగానే విమర్శలు చేస్తున్న సమయంలో తిరిగి వివాదాస్పదం అయ్యేలా ఉత్తరాదివారి అహంకారం అంటూ సదరు ఎ.పి తరుణ్ విజయ్ లానే తానూ కామెంట్ చేసాడు. సౌతిండియన్లు కేంద్రానికి ఇస్తున్న ఆదాయానికి మీరేం చేస్తున్నారని కూడా పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు

Related News