//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆహ్వానించినా పవన్ కళ్యాణ్..కుదరదు అన్న రఘువీరా..!

Category : politics

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల అందరిలాగానే తనకు బాధగా ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్,ప్రశాసన్ నగర్ లోని తన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్,రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ చర్చ అనంతరం ఆర్థికవేత్తలు,విద్యావేత్తలు,మేథావులతో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తామని,బీజేపీ,టీడీపీ చెబుతున్న మాటలను జేఏసీలో చర్చిస్తామని చెప్పారు.

కేంద్రం ఇచ్చిన నిధులెంత,రాష్ట్రం ఖర్చు చేసిందెంత,అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.ఆర్థిక నిపుణుల కమిటీ శ్వేతపత్రం పరిశీలించి వాస్తవం తేల్చుతుందని పవన్ అన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు తేల్చేందుకు ‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ (జేఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసిన పవన్ దాని కిందకి అన్ని పార్టీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే జేఎఫ్‌సీతో కలసి పనిచేయడానికి లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ,కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ సమైక్యత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.వీరిద్దరితో పవన్ ఇప్పటికే చర్చలు కూడా జరిపారు.

ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లో జేఎఫ్‌సీ సమావేశాన్ని పవన్ నిర్వహిస్తున్నారు.ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి సమావేశం గురించి చెప్పి ఆహ్వానించారు.అయితే తనకు వీలుపడదని,తన బదులు ఏపీసీసీ జనరల్ సెక్రటరీలు జంగా గౌతమ్,గిడుగు రుద్రరాజు హాజరవుతారని రఘువీరా చెప్పారు.రఘువీరాతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు,సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణలను కూడా పవన్ ఆహ్వానించారు.రేపటి సమావేశానికి వీరంతా హాజరవుతారు.ఈ సమావేశంలో ఉండవల్లి అరుణ్ కుమార్,జయప్రకాష్ నారాయణ కీలక పాత్ర పోషించనున్నారు.

ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ శ్వేతపత్రంపై అడగటంపై సీఎం చంద్రబాబు స్పందించినట్లు సమాచారం.గురువారం విజయవాడలో జరిగిన టీడీపీ సమన్వయ సమావేశంలో పవన్ ప్రస్తావనను చంద్రబాబు తీసుకొచ్చారు.పవన్ శ్వేతపత్రం అడగటంపై స్పందిస్తూ ‘కేంద్రం ఏమిచ్చిందో,రాష్ట్రానికి ఎంత ఖర్చు చేశామో అన్ని లెక్కలు పారదర్శకంగా వెబ్‌సైట్‌లో పెట్టాం అని ఇంకా ఆయనకు కొత్తగా ఇచ్చేదేముందన్నారు.ప్రత్యేక హోదాకు,ప్రత్యేక ప్యాకేజీకి పెద్ద తేడా లేదని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి’ అని పార్టీ నేతలకు బాబు చెప్పినట్లు సమాచారం.

Related News