//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్ అప్పుడే తలొంచుకుంటున్నాడా ?

Category : editorial

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏ ఫంక్షన్ లో అయిన పార్టీ గురించే మాట్లాడటం విశేషం.తాజా గా జరిగిన 'అజ్ఞాతవాసి' ఫంక్షన్ లో కూడా పార్టీ గురించే మాట్లాడుతున్నారు.పవన్ కల్యాణ్ పార్టీ గురించి ఎపుడు మాట్లాడిన తాను ఓటమి గురించి మాట్లాడం విశేషం . అయితే ఇటీవల్ల ఏ చోటకి వెళ్లిన తాను పార్టీ గురించి మరివు ఓటమి అంటే భయం లేదని పదేపదే చెబుతున్నారు.

అయితే ఏపీలో పర్యటించినప్పుడు, తాజాగా ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్‌లోనూ ఓటమి గురించే ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఈ ‘ఓటమి’ గురించి అటు సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. తాజా గా జరిగిన అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్‌లో పవన్ మాట్లాడుతూ తాను పాపులర్ అవుతున్నకొద్దీ తనను ద్వేషించే ఎవరో తెలిసిందని పవన్ పేర్కొన్నారు. తనకి ఈ దేశం అంటే ఎంతో ఇష్టం అని ఈ దేశం కోసం ఎదో ఒకటి చేయాలి అనిపిస్తుంది అని ఎంతో ఆవేదన పడుతూ ఆవేశం గా చెప్పారు.

అందుకే తన మనసు రాజకీయాల వైపు మళ్లించిందన్నారు. తనకు ఓటములు కొత్త కాదని, కానీ ఓడిపోయే ముందు పెద్ద దెబ్బే కొడతానని అన్నారు. కానీ 'అజ్ఞాతవాసి' పూర్తిగా సినీ వేడుక కావడంతో రాజకీయాల గురించి పవన్ ఇంతకు మించి మాట్లాడలేకపోయారు .

రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టకముందే ఆయన ఓటమి గురించి ఎందుకు మాట్లాడతున్నారన్న చర్చ ప్రారంభమైంది ఇటు సినీ పరిశ్రమలో, అటు రాజకీయాల్లో కూడా. పవన్ కళ్యాణ్ ఇంకా ఓటమి గురించి మాట్లాడుతూ ఓటమి గురించి ముందే తెలిసిన వారు కూడా గంభీరంగా ఉంటారు. తమ సైన్యం లో నమ్మకం కలిగిస్తారు అని పేర్కొన్నారు. కానీ రంగంలోకి దిగకముందే పవన్ ఓటమిని అంగీకరించడం వెనక తాను రాజకీయాలకు సూటవనన్న సంకేతం కూడా అంతర్లీనంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ఈ సారి కొత్తగా పవన్ కళ్యాణ్ తన పార్టీ గురించి మాట్లాడారు ఇలా మాట్లాడటం మొదటిసారి. సాధారణంగా పవన్ ఎక్కడ మాట్లాడినా తన సినిమాల గురించి, వ్యక్తిగత అభిరుచుల గురించి మాట్లాడతారు. కానీ ఈసారి ఓటమి గురించి, తనను ద్వేషించే వారి గురించి మాట్లాడారు. ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారీ మళ్లీమళ్లీ ప్రయత్నించి విజయం సాధిస్తానని జనసేన అధినేత చెప్పుకొచ్చారు.

తనను ద్వేషించే వాళ్లు ఎక్కువయ్యారని పేర్కొన్నారు. ఆయన మాటలను విశ్లేషించిన వారు ఇటీవల జిల్లాల పర్యటనకు వచ్చిన ప్రతిస్పందనలకు ఈ రకంగా సమాధానం చెప్పి ఉంటారని చెబుతున్నారు. ఏది ఏమైనా తన వైఖరిలో మార్పు వచ్చింది అని తను చాల మారిపోయాడు అని రాజకీయాలే తనని మార్చాయి అని అంటున్నారు .

Related News