//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీ ఎమ్మేల్యే సరఫరా చేసిన `విషపూరిత గ్యాస్' తో రోగుల మృతి !

Category : national

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోని ప్రసిద్ధి చెందిన బెనారస్ హిందూ యూనివర్సిటీ కి అనుబంధంగా నడుస్తున్న సర్ సుందర్ లాల్ హాస్పిటల్ లో గత జూన్ లో అధికారికంగా ముగ్గురు రోగులు మృతి  చెందారు. `విషపూరిత గ్యాస్' సరఫరా వల్లన వారు మృతి చెందిన్నట్లు భావిస్తున్నారు. అనధికార కధనాల ప్రకారం పది మంది వరకు మృతి చెందారు. 

ఈ గ్యాస్ ను అలహాబాద్ నార్త్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్యెల్యే హర్షవర్ధన్ భాజపేయి కి చెందిన కంపెనీ సరఫరా చేయడం గమనార్హం. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆహార భద్రత, ఔషధ పరిపాలన విభాగములు కలసి జరిపిన సంయుక్త దర్యాప్తులో 'ఔషధేతర' నైట్రస్ ఆక్సైడ్ ను ఆసుపత్రికి వాజపేయి కి చెందిన పారేర్ హాట్ ఇండస్ట్రీస్ సరఫరా చేసింది.  'ఔషధేతర' అని పేర్కొంటే మనుషులపై అసలు ఉపయోగించరాదు. నైట్రస్ ఆక్సైడ్ ను శస్త్ర చికిత్సల సమయంలో మత్తుమందుగా ఉపయోగిస్తారు. 

గత ఏప్రిల్ లో, యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఈ కంపెనీకి ఈ కాంట్రాక్టు ఇచ్చారు. ఈ కంపెనీ  'ఔషధేతర' మత్తుమందులను సరఫరా చేయడమే కాకుండా, క్లినికల్ గాసెస్ ఉత్పత్తి చేయడానికి అసలు ఆ కంపెనీ కి లైసెన్స్ కూడా లేదు. 

ఇదివరలో యూనివర్సిటీ అంతర్జాతీయ సంస్థ లిండే కు ఇచ్చేవారని, కానీ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకుడుకు చెందిన కంపెనీకి ఇచ్చారని తెలుస్తున్నది. ఆర్ఎస్ఎస్ కు చెందిన వైస్ ఛాన్సలర్ త్రిపాఠి  అలహాబాద్ కు చెందిన వారు కావడంతో, బాజపాయే తో గల సన్నిహిత సంబంధం కారణంగా ఈ కాంట్రాక్టు ఇచ్చిన్నట్లు భావిస్తున్నారు.