//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎస్ బి ఐ కన్నా పతంజలి బ్రాండ్ కే ఇమేజ్ ఎక్కువ !

Category : business

ప్రపంచంలోనే అతిపెద్ద 50 బ్యాంక్ లలో ఒక్కటైనా ఎస్ బి ఐ కన్నా భారతదేశంలో ఇప్పుడు పతంజలికి బ్రాండ్ ఇమేజ్ ఎక్కువగా ఉన్నది. దేశంలో అత్యంత ప్రభావం గల బ్రాండ్ లపై అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఇపిసిస్ జరిపిన అధ్యయనంలో గూగుల్ తిరిగి మొదటి స్థానం పొందగా, మైక్రోసాఫ్ట్,ఫేస్ బుక్ ఆ తరువాతి రెండు స్థానాలు పొందాయి. 

అయితే ఎస్ బి ఐ 9వ స్థానం నుండి 5వ స్థానంకు చేరుకో గలిగింది. అయితే మొదటి పది బ్రాండ్ లలో స్థానం సంపాదించిన వాటిల్లో ఆర్ధిక సంస్థ ఎస్ బి ఐ ఒక్కటే కావడం గమనార్హం. బెస్ట్ 20 బ్రాండ్ ల  జాబితాలో పతంజలి తో పాటు మొదటి సారిగా జియో కూడా రాగలిగింది. చాల తక్కువ కాలంలో ఈ రెండు బ్రాండ్ లు భారత్ మార్కెట్ లో విశేష ప్రభావం చూపాయి.

టాప్ 10 బ్రాండ్ లలో ఫ్లిఫ్ కార్ట్ మూడు స్థానాలు కిందకు వెళ్లి 10వ స్థానంలో ఉండగా, అమెజాన్ రెండు స్థానాలు ఎగబాకి ఆరవ స్థానం పొందింది. గత సంవత్సరం ఆరవ స్థానంలో ఉన్న వాట్స్ అప్ కు టాప్ 20లో స్థానమే దక్కలేదు. ఇక, సామ్ సంగ్ కు 7వ, ఎయిర్ టెల్ కు 8వ, స్నాప్ డీల్ కు 11వ, ఆపిల్ కు 12వ, డిట్టోల్ కు 13వ,  క్యాడ్బరి కి 14వ, సోనీ కి 15వ స్థానాలు లభించాయి. మిగిలిన పేరున్న బ్రాండ్ లలో హెచ్  డి ఎఫ్ సి కి 16వ, మారుతి సుజుకి కి 17వ, గుడ్ డే కి 19వ, ఐ ఫోన్ కు 19వ, అమూల్ కు 20వ స్థానాలు దక్కాయి.