//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వెళ్తున్న విమానంలోనే సెక్స్...ఛి

Category : world

కొందరు మద్యం మత్తులో చేసే పనులు ఇతరులను తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. అసలు తాము ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నాం అనే విజ్ఞత లేకుండా వారు చేసే పనులు అసహ్యాన్ని పుట్టిస్తాయి. తాజాగా ఒక వ్యక్తి ఇదే తరహా పని చేసాడు. జెట్2 విమానాయన సంస్థకు చెందిన విమానం బెల్‌ఫాస్ట్ నుంచి ఈబిజా బయలుదేరింది.దాదాపు వంద మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు,

అయితే ఎలాంటి సాంకేతిక కారణాలు లేకుండా విమానాన్ని నిలిపివేశారు. దీనికి కారణం ఒకసారి చూద్దాం. సదరు విమాన పైలెట్ చెప్పిన వివరాల ప్రకారం ఓ ప్రయాణికుడు ఫుల్‌గా మద్యం సేవించాడని అప్పటికే అతడు స్వయం నియంత్రణ కోల్పోయాడని పైలెట్ చెబుతున్నాడు. అయినా తనకు ఇంకా మద్యం కావాలంటూ సిబ్బందితో గొడవ పడటం మొదలుపెట్టాడని అతడు తెలిపాడు.

సిబ్బంది అతడికి మద్యం ఇచ్చేందుకు నిరాకరించడంతో నిరసన తెలపడం మొదలుపెట్టాడన్నారు. అతడు తన వెంట తెచ్చుకున్న సెక్స్ డాల్‌తో విమానంలో లైంగిక చర్యకు పాల్పడ్డాడని పైలెట్ చెప్పాడు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నాడు. మహిళలు, చిన్నపిల్లల ముందే అతడు ఇలాంటి పని చేస్తుంటడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విమానాన్ని టౌలోస్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశానని తెలిపాడు.