//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మార్చి 10న పార్టీ ప్రకటన అంటున్న కోదండరాం

Category : politics

ప్రొఫెసర్ కోదండరాం త్వరలో ప్రారంభించనున్న తన పార్టీ పేరు, గుర్తు, విధివిధానాలు తదితర వాటిని ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ నిర్వహించిన మార్చి 10న పార్టీ ప్రకటన చేయనున్నారు.

భారీ బహిరంగ సభ నిర్వహించి అశేష జనవాహిని మధ్యలో పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించాలని కోదండరాం నిర్ణయించారు. తొలుత ఈనెలలోనే పార్టీకి సంబంధించి ప్రకటన చేయాలని భావించినా మిలియన్ మార్చ్ నిర్వహించిన రోజును పురస్కరించుకుని ప్రకటన చేస్తే బాగుంటుందని కోదండరాం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరును కోదండరాం ఖరారు చేసినట్టు జేఏసీ నేతలు చెబుతున్నారు. అయితే సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తెలంగాణ సకల జనుల పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ, ప్రజా తెలంగాణ పార్టీ పేరుతో మరో మూడు పేర్లను కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టు చెబుతున్నారు. ఇక, పార్టీ ప్రకటించడానికి ముందే జేఏసీ నుంచి కోదండరాం వైదొలగనున్నట్టు తెలుస్తోంది.

Related News