//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మానవత్వం చాటుకున్న యజమాని....!

Category : state

పెంచుకున్న పక్షులు, జంతువులను చంపుకు తినే వల్లే కానీ వాటి గురించి పట్టించుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు. వివరాలలోకి వెళ్తే... అమ్రోహలోని హసన్‌పూర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసే పంకజ్ కుమార్ మిట్టల్ అనే వ్యక్తి ఒక చిలకను తన సొంత కొడుకుకన్నా ఎక్కువగా పెంచుకున్నాడు.

మానవత్వం మంటకలిసిపోతున్న ఈ రోజుల్లో పంకజ్ వాళ్ళు ఉన్నారు అంటే ఆశ్చర్య పోనక్కరలేదు. కానీ ఇక్కడ ఏంజరిగింది అంటే పంకజ్ ఎంతో ఇష్టంగా పెంచుకున్న రామచిలుక మర్చి 5న మరణించింది. తరువాత ఆయన ఏంచేశారు అంటే, చనిపోయిన తన పెంపుడు చిలుకకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి దానిపట్ల ఉన్న తన ప్రేమను చాటుకున్నాడు.

దానితోపాటు 11వ రోజున ఆచారాల ప్రకారం హవాన్, భోజ్ వేడుకలను కూడా శాస్త్రబద్ధంగా నిర్వహించి పూర్తిచేసాడు. సాంప్రదాయంగా ఆ చిలుక యొక్క చితాభస్మాన్ని గంగ నదిలో కలిపి ప్రత్యేక ప్రార్ధనలు కూడా చేసాడు.