Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Paritala ravi : పరిటాల రవి : paritala ravi death secrets caste son sriram videos and death;;

Category : editorial

పరిటాల రవి ఆగష్టు 30, 1958 లో జన్మించాడు. ఈయన పూర్తీ పేరు పరిటాల రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసన సభ సభ్యుడు. రవి తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు. పరిటాల రవి తల్లితండ్రులు శ్రీరాములు,నారాయణమ్మ. ఆయన భార్య పేరు పరిటాల సునీత. ప్రస్తుతము తెలుగు దేశం పార్టీ తరపున రప్తాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. పరిటాల రవి గారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొడుకు శ్రీరామ్ ఇప్పుడిపుడే రాజకీయాల్లోకి వస్తున్నారు.

1975లో భూస్వాములు, ఫ్యక్షనిస్ట్లు కుట్రపన్ని పరిటాల శ్రిరములుగారిని, అయన తమ్ముడు పరిటాల సుబ్బయ్యని దారుణంగా హత్యచేసారు. తండ్రి చనిపోయేనాటికి పరిటాల రవీంద్ర వయసు పదిహేను సంవత్సరాలు. ఎటు చుసిన నలువైపుల అలజడి అభద్రతా అంతులేని అరాచకం. ఎ క్షణన ఏ పెనుముప్పు ముంచుకోస్తుందో అంతుపట్టని ఉద్రిక్త వాతావరణం. కన్నబిడ్డల కోసం గుండేను బండరాయిల చేసుకుని బతుకుతున్న తల్లి నారాయణమ్మకి అండగా నిలబడ్డాడు. తమ్ముడు హరితో పటు ఆహోరాత్రాలు శ్రమించి తండ్రి తాలుకు అప్పుల్ని తిర్చెశారు. తండ్రి అడుగుజాడల్లో నడిచిన తమ్ముడు హరి బూటకపు ఎన్ కౌంటర్ లో మరణించాడు. పరిటాల హరి మరణం తో ప్రాంతమంతట మళ్ళి చిమ్మచీకట్లు కమ్ముకున్నయి. అరాచకం తీవ్ర స్థాయి కి చేరింది.

భూస్వాములు, ఫ్యక్షనిస్ట్లు పరిటాల రవీంద్ర మీద దృష్టిని సారించారు. అతనని వెంటాడి వేధించటం ప్రారంభంచారు. కష్టకాలంలో విప్లవ శిబిరం పరిటాల రవీంద్ర ఆశ్రయం కల్పించింది పరిటాల శ్రీరాములు హత్య వెనుక కుట్ర జరిపిన ముఖ్యుడుని గుర్తిచిన పీపుల్స్ వార్ పార్టీ మద్దెలచెరువు గ్రామానికి చెందిన మాజి ఎమ్మోల్ల్య గంగుల నారాయణ రెడ్డిని 1983లో కాల్చి చంపింది.

ఈ హత్యకేసులో పరిటాల రవిని ప్రధాన ముద్దాయిగ చేర్చారు. అజ్ఞాత జీవితం గడుపుతనే మొదటినుంచి తన కుటుంబానికి బాసటగా వుంటూ వచ్చిన జనాన్ని సంఘటితం చేసుకుంటూ వచాడు పరిటాల రవీంద్ర 1983 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసరిగా కొంగ్రసేతెర ప్రభుత్వాని స్థాపించిన తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్. టి. రామారావు ముఖ్యమంత్రి అయ్యరు.

రాష్ట్ర రాజకీయ వాతావరణంలో ఒక తాజాదనం వేల్లువిరిసింది 1984లో పరిటాల రవీంద్ర తన స్వగ్రామం చేరుకున్నాడు 1984 అక్టోబర్ 27న దర్మవరుపు కొండన్నగారి పెద్ద కుమార్తె సునితతో పరిటాల రవి పెళ్లి జరిగింది పరిటాల శ్రీరాములు హత్యకసులో ప్రధాన ముద్దాయి సిద్దప్ప శిక్ష ముగించుకుని జైలునుంచి బైటకి వచ్చాడు. 1986లో పీపుల్స్వార్ ఆగ్రహానికి గురై దుర్మరణం చెందాడు.

1991 నుంచి విశ్రుంఖల స్వైర విహారం చేస్తున్న ఆరాచక శక్తుల్ని రకరకాల పద్దతుల ద్వార ఎద్రుకోవటం వాళ్ళ పరిటాల రవి ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు తననీ తన అనుచరుల్ని నక్సలైట్లుగ చిత్రించి మట్టుపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పరిటాల రవికి సమాచారం అందింది. 1992 లో జిల్లా ఎస్. పి. కెప్టెన్ కే. వి. రెడ్డి సమక్షంలో పోలిసుల ముందు లొంగిపోయాడు.

సరెండర్ అయిన మరుసటి దినం నుంచే పరిటాల రవి క్రియాశీల రాజకేయల్లోకి ప్రవశిస్తున్నట్లు ప్రచారం ప్రారంభమయింది. ధర్మవరం లో ఓబులరెడ్డి అరాచకాలను బహిరంగంగా ఎదురించిన మొదటి వ్యక్తి షాక్ ముష్కిన్ మాజీ తీవ్రవాది అయిన ముష్కిన్ పరిటాల రవికి సన్నిహితుడు. 1993 సెప్టెంబర్ 23న ఎస్వీ సోదరులు, సూరి సోదరులు ముష్కిన్ ని దారుణంగా చంపారు. 1993 జూన్ 7న రవి తెలుగుదేశం పార్టీలో చేరాడు.

ఒక్క అనంతపురం జిల్లా మాత్రమేగాక రాయలసీమకు చెందినా టి డి పి కార్యకర్తలు, సానుభూతిపరులు పరిటాల రవీంద్రకు బ్రహ్మరధం పట్టారు. 1993 అక్టోబర్ 24న మద్దలచెరువు గ్రామంలో టివీ బాంబు సంఘటన జరిగింది. ఈ సంఘటనతో సూరి దమ్ముడు రఘునాధరెడ్డితో సహా ఆరుగురు చనిపోయారు. ఈ సంఘటనకు ప్రధాన కారకుడు పరిటాల రవేనని కొంగ్రాస్ నాయకులూ విమర్శల వర్షం కురిపించారు. 1994 జూన్ 17న వై. యస్. రాజారెడ్డి వెంకటాపురం వెళ్ళి పరిటాల రవిని కలిశాడు. రాజారెడ్డి , రవీంద్రల కలయిక కొంగ్రెస్ వర్గాల్లో కలవరం సృష్టించింది. ఆగష్టు 7న హైదరాబాద్ సమీపంలోని షాద్నగర్ లో జంట హత్యలు జరిగాయి. హతులిద్దరూ పెనుగొండ శాశానసభ్యుడు ఎస్. వి. రమణారెడ్డి అనుచరులు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి పరిటాల రవి.

2005 జనవరి 24వ తేదీ. అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం. అనేకమంది అతిరధమహరధులు వంటి పార్టీ రాష్ట్రనాయకులు అక్కడే వున్నారు. సాయూధలైన అనేకమంది అన్గారక్షకులున్నారు. మధ్యన్నభోజనం ముగించుకుని యింటికీ బయలుదేరుదామని పార్టీ కార్యాలయం ఆవరణలోకి అడుగుపెట్టిన ప్రజల మనిషి పరిటాల రవీంద్ర మీద బులెట్ ల వర్షం కురుసింది. శత్రువులు పకడ్బందిగా పన్నిన పద్మవ్యూహంలో పొరపాటున పడిన అతని అడుగు నెత్తుటి తో తడిసి పోయింది. పిడుగుపాటు వంటి ఈ వార్తకి ఆంధ్రరాష్ట్రం భగ్గుమంది.వారల తరబడి అనేక నగరాల్లో నిరవదికంగా కర్ఫ్యూ కొనసాగింది