//single page style gallary page

Paritala Family party changes, it is in the BJP or in the YCP

Category : politics

Click here to read this article in Telugu

పరిటాల ఫ్యామిలీ పార్టీ మారితే అది బీజేపీ లోకా....లేక వైసీపీ లోకా....?

ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం తరువాత తెలుగు దేశం పార్టీలో కొంత మేర రాజకీయ శూన్యత కనిపిస్తుంది. ఈ సారి ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరమైన ఓటమి చవి చూసిన టీడీపీ నేతలు... ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పై బీజేపీ పార్టీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలుస్తుంది...అంతే కాకుండా టీడీపీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ పార్టీ కీలక నేత అయిన పరిటాల సునీత సైతం బీజేపీ పార్టీ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది.

అంతే కాకుండా ముందు నుంచి కూడా పరిటాల రవి ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. 2005లో పరిటాల రవి హత్య అనంతరం ఆ జిల్లా రాజకీయాల్లోకి వచ్చిన సునీత... అప్పటి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పరిటాల సునీత... 2019లో తాను పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను ఎమ్మెల్యేగా బరిలోకి దింపారు. అయితే దశాబ్దాల పాటు తెలుగు దేశం పార్టీని నమ్ముకున్న ఆ కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వాలని ఆయన పార్టీ అధినాయకత్వాన్ని కోరారు. అయితే చంద్రబాబు మాత్రం పరిటాల కుటుంబానికి ఒకే సీటు కేటాయించారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో తన కుమారుడు శ్రీరామ్ పొలిటికల్ ఎంట్రీ కోసం పరిటాల సునీత ఈ పోటీ నుంచి తప్పుకున్నారు.

మరోవైపు ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత బీజేపీ ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది... ఈ క్రమంలోనే పరిటాల కుటుంబంతో చర్చలు జరిపిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబాన్ని ఆకర్షించగలిగితే టీడీపీని దెబ్బ కొట్టవచ్చనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. పరిటాల ఫ్యామిలీతో బీజేపీ ముఖ్యనేత రాంమాధవ్ చర్చలు కూడా జరిపారని సమాచారం. అయితే అంతకుముందే పరిటాల ఫ్యామిలీ వైసీపీలోకి వెళుతుందనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ పరిటాల కుటుంబానికి చెందిన సన్నిహితులు మాత్రం... ఆ కుటుంబం టీడీపీతోనే ఉంటుందని ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. మొత్తానికి పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై పరిటాల కుటుంబం ఏం క్లారిటీ ఇస్తుందన్నది మును ముందు చూడాలి.

After the victory of the VCP in the AP election, the Telugu Desam Party has a slight political vacuum. It is speculation that TDP leaders who have seen this party's defeat in the polls this time ... are looking towards other parties. If this is the case, it is clear that the BJP has also put a special focus on the politics of the state of Andhra Pradesh ... Also, the key leaders of the TDP are also consulted with the party leaders. But recently the party leader TDP leader Anantapur district, Paratala Suneeta, is preparing to join the BJP party. From the emergence of the party, the family in Anantapur district is coming to TDP.

Apart from this, Ravi has been very close to NTR. Sunita who came into the politics of the district after the murder of Pattala Ravi in 2005 ... has since succeeded as MLA. In 2014, TDP has been in power since the end of 2014. In 2019, he withdrew from the contest and his son Parralla Sriram was the MLA. However, he has asked the party leadership to give two seats to the family who trusted the TDP nation for decades. But Chandrababu was allotted a single seat for the family of the pandas. Without corrective circumstances, Sriniman's Srinitha has come out of the competition for her son Sriram's political entry.

On the other hand, after the defeat of the TDP, the Special Focus on the BJP AP has made speculation that the discussions have been held with the family of the band. The BJP seems to have thought that TDP could be hit if it could attract a family of paddy in Anantapur district. Information about the BJP Chief Minister Ramadav's discussions with the family of the parish. However, there have been speculation that the packages will go into the Family Whatside. But the relatives of the family of the pants were ... telling me that the family would be with TDP. The whole family should look at what clarity will give to the band of parties on the party change.