//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నగర బహిష్కరణకు గురైన పరిపూర్ణానంద స్వామి...!

Category : state

తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు దేవుళ్ళ గురించిన చర్చ చాల తీవ్ర స్థాయి లో ఉంది. శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుండి నగర బహిష్కరణ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. గత మూడు రోజులుగా జూబ్లీహిల్స్‌లో గృహనిర్బంధంలో ఉన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంటి నుంచి ఎవరికీ తెలియని చోటికి తరలించారు.

ఎక్కడికి తరలించారనే విషయాన్ని మాత్రం పోలీసులు ఇంకా స్పష్టం చేయలేదు. గత సంవత్సరం నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన ప్రసంగంపై చేసిన ఫిర్యాదుల మేరకు ఆయనకు నగర బహిష్కరణ నోటీసులు ఇచ్చినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఆయన ఈ రోజు నుండి ఆరు నెలల పాటు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించకూదని పోలీసులు నోటీసులో తెలిపారు.

ఇందులో భాగంగా ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈరోజు తెల్లవారుజామున నగరం నుంచి తరలించారు. ఆయనను తరలించడంలో పోలీసులు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించినట్లు సమాచారం. ఆయన స్వస్థలమైన కాకినాడుకు తరలిస్తారో... మరో చోటుకి తరలించారో అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండడం వల్లే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పరిపూర్ణానంద స్వామికి నగర బహిష్కరణ నోటీసులు అందినట్లు న్యాయసలహాదారు పద్మారావు కూడా ధృవీకరించారు.

ఇటీవల ఓ ఛానల్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. వాటిని నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు పూనుకున్నారు. కాగా, ఈ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మూడు రోజులుగా ఆయన గృహ నిర్బంధంలోనే ఉన్నారు. మరోవైపు కత్తి మహేశ్‌ను కూడా రెండు రోజుల క్రితం నగర బహిష్కరణ చేసిన విషయం అందరికి తెలిసిందే.