ఎక్కడ చూసినా డ్రగ్స్ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. మన దగ్గర ఈ విష సంస్కృతి ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.అగ్రరాజ్యం అమెరికా నుంచే ఇది ప్రపంచమంతా పాకింది. అవడానికి అభివృద్ధి చెందిన దేశమే అయినా, అక్కడ డ్రగ్స్ సంస్కృతి దారుణం. ఎంతలా అంటే, ఇంకా కళ్లు తెరవని పసిగుడ్డుకు అక్కడి తల్లిదండ్రులే డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఇంతకంటే అమానుషం ఉంటుందా..?
అమెరికాలోని ఒక తల్లి, తన బిడ్డ కడుపులో ఉండగా డాక్టర్లు సూచించిన మందులతో పాటు, హెరాయిన్ ను కూడా అలవాటు చేసుకుని దానికి బానిసగా మారింది. అయితే, కడుపులో ఉండగా ఆ మత్తుకు అభం శుభం తెలియని ఆ చిట్టి ప్రాణం కూడా బానిసగా మారడం ఇక్కడ విషాదం. బిడ్డ అడిక్ట్ అయిపోవడంతో, పుట్టిన తర్వాత ఆ పసిగుడ్డుకు కూడా బిళ్లలను పొడి చేసి, నాలికపై రాయడం మొదలుపెట్టారు. బేబీకి చేసిన మెడికల్ టెస్టుల్లో ఆ తల్లిదండ్రుల నిర్వాకం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు, వారి ఇంట్లో సోదాలు నిర్వహించి, పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు.