//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్యారడైజ్ బిర్యానీ

Category : state

ప్యారడైజ్ బిర్యానీ అనగానే ఎక్కడలేని ఆకలి పుట్టుకొస్తుంది. ఎంతో తస్తి బిర్యాని అంటూ ఎంత దూరంలో ఉన్నా వెళ్లి తినటానికి ఇష్టపడతారు భోజన ప్రియులు. అలాంటి ప్యారడైజ్ బిర్యానీ కి అరుదైన గుర్తింపు లభించింది.

హైదరాబాద్ అనగానే గుర్తు వచ్చే వాటిలో బిర్యానీ ఒకటి. హైదరాబాదీ బిర్యానికి ప్రపంచ స్థాయిలో పాపులారిటీ ఉంది. ముఖ్యంగా పారడైస్ బిర్యానీ ఎంతో ఫేమస్. మరి ఎంతో ఘుమఘుమలాడే బిర్యానీ అందించే పారడైస్ ఫుడ్ కోర్ట్ మరో మైలు రాయి దాటింది. జనవరి 1, 2017 నుండి డిసెంబర్ 31, 2017 మధ్యలో అత్యధిక స్థాయిలో మొత్తం 70,44,289 బిర్యానిలు కస్టమర్లకు సర్వ్ చేసి రికార్డ్ సృష్టించింది.

ఈ సందర్భంగా "లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ 2019"లోకి పారడైస్ చేరింది. ఈ అచీవ్మెంట్‌ను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ వారు 2019 ఎడిషన్‌లో రికార్డ్ చేశారు. ఇంతగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని మాపై బాధ్యత పెరిగిందని పారడైస్ ఫుడ్ కోర్ట్ CEO గౌతమ్ గుప్తా అన్నారు.

Related News