11 ఏళ్ల చిన్నారి పెదాలపై పెట్టిన ముద్దు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపడంతో అసోం గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ అంగారగ్ పపొన్ మహంత బహిరంగ లేఖ ద్వారా వివరణ ఇచ్చాడు.
తానెలాంటి తప్పు చేయలేదని అన్నాడు. 14 ఏళ్ల క్రితం పెళ్లైన తనకు ఇద్దరు పిల్లలున్నారని తెలిపాడు. ఏ విషయాన్నైనా ఓపెన్ గా ఎక్స్ ప్రెస్ చేయడం తనకు అలవాటని, అలాగే తాను పాపకు ముద్దుపెట్టాను తప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేదని అన్నాడు. ఒకవేళ తన మనసులో ఏదైనా దురుద్దేశం ఉంటే ఆ వీడియోని ఫేస్ బుక్ లో ఎందుకు పెడతానని ప్రశ్నించాడు.
తాను ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నానని, ఒకవేళ ముద్దుపెట్టడమే తప్పయితే మాత్రం తనను క్షమించాలని విమర్శకులను పపొన్ కోరాడు. సోషల్ మీడియా ద్వారా చేసే విమర్శలు రెండు కుటుంబాలలో చిచ్చుపెడతాయని ఆందోళన వ్యక్తం చేశాడు. దయచేసి ఓ అమాయక చిన్నారి జీవితాన్ని నాశనం చేయొద్దని ఆ బహిరంగ లేఖలో పపొన్ కోరాడు.
దీని పై బాలిక తండ్రి స్పందిస్తూ, పపొన్ ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. ఈ విషయంలో పపొన్ ని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు.