Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేను చదివిన మొట్ట మొదటి కవిత...పేపర్ బాయ్ ట్రైలర్ రిలీజ్ ....!

Category : movies

జయశంకర్ దర్శకత్వంలో సంతోష్ శోభన్, రియా సుమన్, తన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం పేపర్ బోయ్. ఈ సినిమాకు భీమ్స్ సంగీతాన్ని అందించారు. సంపత్ నంది నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అయింది.

ఇక ట్రైలర్ విషయానికొస్తే ‘‘ధరణి.. నేను చదివిన మొట్ట మొదటి కవిత.. ఈ మూడు అక్షరాలు నాకు పరిచయమైంది పుస్తకాల్లో.. దగ్గరైంది అక్షరాల్లో..’’ అంటూ ట్రైలర్‌లో హీరో ని చూపించారు డైరెక్టర్.

‘‘ప్రేమంటే ఆక్సీజన్ లాంటిది.. అది కనిపించదు కానీ బతికిస్తుంది ’’ అని హీరో చెప్పే డైలాగ్స్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. ‘‘ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు. కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇద్దరి ప్రపంచం ఒకటే అనిపించింది’’ అంటూ హీరోయిన్ చెప్పే మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయ్ .

‘‘ఏ అక్షరాలైతే మమ్మల్ని కలిపాయో.. అవే అక్షరాల్లోనే రాసుకున్నా.. తనకు శాశ్వతంగా దూరం కావాలని’’ అంటూ హృదయానికి హత్తుకునేలా డైలాగ్స్ రాశారు సంపత్ నంది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక ప్లస్ అయితే సినిమాటోగ్రఫీ ఒక అద్భుతమనే చెప్పాలి. ట్రైలర్‌ని బట్టి చూస్తే సినిమా మంచి సక్సెస్ అవుతుందనిపిస్తోంది.