యోగా గురు రాందేవ్ బాబా పలు వ్యాపారాల్లో భారీగా సంపాదించడంతో పలువురు బాబాలు ఆయన బాటలో వ్యాపారాలపై ద్రుష్టి సారిస్తున్నారు. ఇదే క్రమంలో మరో ఆధ్యాత్మిక గురు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, ఆయుర్వేదిక్ టూత్‌పేస్టులు, సబ్బులు విక్రయంలోకి వస్తున్నారు. ఇందుకోసం త్వరలోనే 1,000 రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తున్నది.
భారత్‌లో ఆయుర్వేదిక్ ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రవిశంకర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అదే విధంగా క్లినిక్స్, ట్రీమెంట్మెంట్ కేంద్రాలను కూడా తెరువబోతున్నారట. ప్రస్తుత తయారీదార్లు అందిస్తున్న వాటికంటే భిన్నంగా తమ బ్రాండ్ ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నట్లు శ్రీశ్రీ ఆయుర్వేద ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తేజ్ కట్పిటియా పేర్కొన్నారు.
ఇందుకోసం ''శ్రీశ్రీ తత్త్వ'' బ్రాండెడ్ స్టోర్లను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ కంపెనీ మోడరన్ రిటైల్ స్టోర్లు, ఆన్లైన్ ద్వారా హెల్త్ డ్రింక్స్, సబ్బులు, సుగంధాలు, సుగంధ ద్రవ్యాలును 2003 నుంచి విక్రయిస్తోంది. తాజాగా ప్రస్తుతం పలు ఆహార, గహ కేటగిరీల్లో 300కు పైగా ఉత్పత్తులను అందుబాటులోకి తేనుందని తేజ్ తెలిపారు.