పాకిస్తాన్ రహస్యంగా అణు ఆయుధాలను దాచేందుకు నిర్మిస్తున్న అణు స్థావరాలు ఎక్కడ ఉందో తెలిసింది. ఆ ప్రమాదకరమైన షెహీన్ మిస్సైళ్లను ఖైబర్-ఫక్తున్క్వాలోని పీర్‌థాన్ పర్వతశ్రేణుల్లో దాచిపెట్టినట్లు తెలుస్తున్నది. శాటిటైట్ చిత్రాల ఆధారంగా ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ అంచనాకు వచ్చారు. ఈ మిసైల్ కు సుమారు 2750 కిలోమీటర్ల దూరం వరకు చెందించే సామర్థ్యం ఉంది. షెహీన్ మిస్సైళ్లను స్టోర్ చేసిన ప్రాంతం భారత్‌కు అతి సమీపంలో ఉండటంతో కొంత ఆందోళన కలిగించే విషయం. పీర్ థామ్ పర్వత ప్రాంతాలు అమృత్‌సర్‌కు కేవలం 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పాకిస్తాన్ ఇలా స్థావరాలను నిర్మించడం కొత్తమే కాదు, ఇంతకు ముందు కూడా ఇలా అణు ఆయుధాలను దాచిపెట్టింది. షెహీన్ మిస్సైళ్లను దాచి పెట్టేందుకు 2003 నుంచి 2011 వరకు ఆ టన్నెల్‌ను నిర్మించినట్లు తెలుస్తున్నది. పాక్ వద్ద ప్రస్తుతం 140 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.