Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పాక్ జర్నలిస్ట్ జీనత్ సురక్షితం విడుదల 

Posted 3 months ago | Category : national

రెండేళ్ల క్రితం కిడ్నాప్‌కు గురైన పాకిస్థానీ మహిళా జర్నలిస్టు సురక్షితంగా విడుదలయ్యారు. కిడ్నాపర్ల చెర నుంచి గురువారం రాత్రి ఆమెను కాపాడినట్లు పాకిస్థాన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ ఆన్‌ ఎన్‌ఫోర్స్‌డ్‌ డిసప్పియరెన్సెస్‌ (సీఐఈడీ) ఛైర్మన్‌ జావెద్‌ ఇక్బాల్‌ ప్రకటించారు.

లాహోర్‌కు చెందిన 26ఏళ్ల జీనత్‌ షాజాదీ జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. 2015 ఆగస్టు 19న ఆమె విధులకు వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న భారత వ్యక్తి హమీద్‌ అన్సారీ తరఫున ఆమె అక్కడి న్యాయస్థానంలో కేసు వేశారు. దీనివల్లే ఆమె కిడ్నాప్‌ జరిగి ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. రెండేళ్ల తర్వాత గురువారం ఆమె సురక్షితంగా విడుదలయ్యారు. దేశ వ్యతిరేక సంస్థలు, ప్రభుత్వేతర వ్యక్తులు జీనత్‌ను అపహరించినట్లు ఇక్బాల్‌ తెలిపారు.

ముంబయికి చెందిన హమీద్‌ అన్సారీ తన స్నేహితురాలిని కలిసేందుకు 2012లో ఆఫ్గానిస్థాన్‌ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లాడు. అయితే అక్రమంగా దేశంలోకి చొరబడ్డాడని ఆరోపిస్తూ అన్సారీని పాక్‌ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ అరెస్టు విషయాన్ని బయటకు వెల్లడించలేదు. దీంతో అన్సారీ కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అన్సారీ కన్పించడం లేదంటూ 2015లో అతడి తల్లి ఫౌజియా తరఫున జీనత్‌ పాక్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దీంతో అన్సారీ తమ వద్దనే ఉన్నాడంటూ భద్రతాసంస్థలు వెల్లడించాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే జీనత్‌ కిడ్నాప్‌కు గురవడం గమనార్హం. జీనత్‌ విడుదలతో ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే జీనత్‌ కిడ్నాప్‌తో మనస్తాపానికి గురైన ఆమె సోదరుడు సద్దామ్‌ గతేడాది ఆత్మహత్య చేసుకున్నాడు.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి