//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నవాజ్ షరీఫ్‌కు పాకిస్తాన్ కోర్టు ఝలక్!

Category : national

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబానికి మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. షరీఫ్‌తో పాటు ఆయన కుమార్తె మర్యామ్ నవాజ్, అల్లుడు సప్ధార్‌లపై పాక్ అవినీతి వ్యతిరేక కోర్టు నేరాభియోగాలు దాఖలు చేసింది. నేషనల్ ఎకౌంటబులిటీ బ్యూరో (ఎన్ఏబీ) చేసిన అవినీతి ఆరోపణల మేరకు.. వీరిపై అభియోగాలు దాఖలు చేసి దర్యాప్తులో మరింత దూకుడు పెంచింది. నవాజ్ షరీఫ్, ఆయన లాయర్ క్వాజా హారిస్ ఇద్దరూ దేశంలో లేకపోయినప్పటికీ ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు అభియోగాలు నమోదు చేయడం విశేషం. ఈ ఆరోపణలపై తమకు ఏపాపం తెలియదని ఈ ముగ్గురూ ఇటీవల కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.కాగా విచారణ సందర్భంగా ఈ కేసులో అభియోగాల నమోదు నిలిపివేయాలంటూ సప్థార్ న్యాయవాది కోరినప్పటికీ కోర్టు తిరస్కరించడం విశేషం.ఎన్ఏబీ తనపై విడివిడిగా అవినీతి కేసులు నమోదు చేయడంపై నవాజ్ షరీఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారనీ... అది తేలేవరకు అభియోగాల నమోదు నిలిపివేయాలని సప్ధార్ న్యాయవాది అంజాద్ వాదించారు. కాగా తనపై దాఖలు చేసిన మూడు కేసులను ఒక్కటిగా చేసి విచారించాలంటూ నవాజ్ షరీఫ్ ఇటీవల సుప్రీంకోర్టుకు విన్నవించారు. అయితే దీనిపై కోర్టు నిర్ణయం వెలువరించాల్సి ఉంది.పనామా పత్రాల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్‌ను... పాక్ సుప్రీంకోర్టు జూలై 28న ప్రధాని పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.