అంతర్జాతీయ న్యాయస్థానంలో కమాండర్ కుల్‌భూషణ్ జాదవ్ కు ఊరట లభించింది. తుది తీర్పు వచ్చేవరకు ఉరిశిక్షను నిలిపివేయాలని తీర్పునిచ్చింది. దీంతో మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. జాదవ్‌తో ఆ దేశ రాయబార కార్యాలయం సంప్రదింపులు జరిపేందుకు అవకాశం ఇచ్చి ఉండవలసిందని పాకిస్థాన్‌కు తెలిపింది. ఈ కేసులో విచారణ జరిపే అధికార పరిథి అంతర్జాతీయ న్యాయస్థానానికి లేదని పాకిస్థాన్ చేసిన వాదనను ఐసీజే తోసిపుచ్చింది.