ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తుంటారు. అయితే ఈ మాసంలో ఉపవాస దీక్షలు పాటించకుండా ఆహారం స్వీకరిస్తే జైలుకి పంపే చట్టాన్ని పాకిస్తాన్ తీసుకొచ్చింది. ఈ వారం ప్రారంభంలో 1980 ఆర్డినెన్స్ కు పాక్ సెనేట్ సవరణ చేసింది. రంజాన్ మాసంలో బహిరంగంగా తిన్నా, ధూమపానం చేసినా రూ. 500 జరిమానాతో పాటు మూడు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశారు. ఈ నిర్ణయంపై దివంగత పాక్ ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె బఖ్తవార్ భుట్టో జర్దారీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పొట్టనబెట్టుకుంటున్న ఉగ్రవాదులను రోడ్లపై స్వేచ్ఛగా తిరగనిస్తూ... సామాన్యులను మాత్రం జైలుకు పంపే కార్యక్రమం చేస్తోందని మండిపడ్డారు. ఈ చట్టంతో ప్రజలు హీట్ స్ట్రోక్, డీహైడ్రేజషన్ తో చనిపోతారని ఆమె చెప్పారు. అసలు ఇది ఇస్లాంకు పూర్తిగా వ్యతిరేకమని ఆమె ట్వీట్ చేశారు.
ఉపవాసం ఉండకపోతే జైలుకు పంపే చట్టాన్ని తీసుకొచ్చిన పాక్
Related News
-
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపండి .. మేము అండగా ఉంటామన్న అమెరికా
-
పట్టాలెక్కిన వందే భారత్ ఎక్స్ప్రెస్... ప్రత్యేకత ఇదే
-
అమర జవాన్ల కుటుంబాలకు విజయ్ దేవరకొండ సాయం ... విజయ్ బాటలో ఫ్యాన్స్
-
పాక్కు గుణపాఠం చెప్పడం కోసం , మరో కుమారున్ని సైతం సైన్యంలోకి పంపిస్తా.....!
-
ఉగ్ర దాడిని ఖండిస్తూ...అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు
-
44 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్న ఉగ్ర దాడి ..దాడి చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ
-
ఫేక్ న్యూస్ గ్రూప్ లే టార్గెట్ .. వాట్సాప్ సంచలనం
-
రాఫెల్ వివాదంపై కేంద్రానికి నేడు కాగ్ నివేదిక
-
సైబర్ నేరగాళ్ళకు చెక్ పెట్టండి ఇలా
-
విదేశాలకు వెళ్ళేవారు ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఎందుకంటే
-
అమెరికాలో బంధీలైన తెలుగు విద్యార్థులు..న్యాయసహాయం అందిస్తున్న నాటా