//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జాదవ్ తల్లి, భార్యను విధవలుగా మార్చిన పాక్

Category : world

గూఢాచార్యం నెపంతో పాకిస్తాన్‌లో శిక్ష అనుభవిస్తున్న భారత మాజీ నేవీ ఆఫీసర్ కులభూషణ్ జాదవ్‌ను చూసేందుకు వెళ్లిన అతడి తల్లి, భార్యకు ఆ దేశ అధికారులు నరకాన్ని చూపించారు.

మానవతా ధృక్పథంతో జాదవ్‌ను చూసేందుకు అనుమతినిచ్చాం అని పాక్ ఊదరగొట్టినప్పటికీ.. అతడి తల్లి, భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఈ విషయాలను రాజ్యసభలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ప్రస్తావించారు.

కులభూషణ్‌ను చూసేందుకు వెళ్లేముందు అతడి తల్లి, భార్య కుంకుమ, తాళిని పాక్ అధికారులు తీసేయించారు. అది తెలియని జాదవ్ వారిని కలిసిన వెంటనే నాన్నకు ఏమైంది? అంటూ ప్రశ్నించారు.

జాదవ్‌తో అతడి తల్లి మరాఠీలో మాట్లాడుతుంటే అడ్డుకున్న అధికారులు కొన్ని సార్లు ఇంటర్‌కమ్‌ను స్విచ్ఛాఫ్ చేశారు.

జాదవ్ భార్య బూట్లలో ఏదో ఉన్నట్లు పాక్ చెబుతుంది.. అయితే అక్కడకు వెళ్లడానికి ఆమె రెండు విమానాలు మారింది, అక్కడ ఎవరికీ ఇలాంటి అనుమానం రాలేదు, కానీ పాక్ అధికారులకు మాత్రం వచ్చింది.

జాదవ్ తల్లి ఎప్పుడూ చీరలే ధరించేది, అలాంటిది ఆమెతో బలవంతంగా సల్వార్ కుర్తా వేయించారు. తాళి, బొట్టు తీసేయించి ఇద్దరు వివాహితులను విధవలుగా మార్చారు.

జాదవ్ మీటింగ్‌ను కేవలం ప్రచారం కోసమే పాకిస్తాన్ వాడుకుంది. కానీ అక్కడకు వెళ్లిన జాదవ్ తల్లి, భార్యకు అడుగడుగునా నరకం చూపించారు.