పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని ఓ అధికారి ఓ విచిత్రమైన తీర్పుని వెలువరించారు.ఓ పిల్లాడిని కరిచినందుకు కుక్కకు మరణ శిక్ష విధించారు. భక్కర్ కలోర్ ప్రాంతంలో అసిస్టెంట్ కమిషనర్ రజా సలీమ్ స్థానికంగా ఉండే ఓ పిల్లాడిని కరిచినందుకు మానవీయ పరిస్థితుల నేపథ్యంలో సదరు కుక్కని మరణశిక్ష విధించాలని ఆదేశించారు.పిల్లాడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కుక్క ఇప్పటికే వారం రోజుల జైలు శిక్ష అనుభవించిందని,ఇప్పుడు మళ్లీ మరణశిక్ష వేయడం సరికాదని కుక్క యజమాని జమీల్ అన్నారు.ఈ నేపథ్యంలో కుక్క యజమాని స్థానిక అదనపు కమిషనర్ ని ఆశ్రయించాడు.తన కుక్కకు న్యాయం జరిగేందుకు తాను అన్ని కోర్టులకూ వెళ్తానని కూడా ఆయన చెప్పారు.మనుషులఫై కోర్టులో ఉన్న కేసులుకే దిక్కులేదు కానీ కుక్కల ఫై కేసులుకు ఎప్పుడు న్యాయం జరగాలి.