వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ భారత్‌కు తిరిగొచ్చాడు. సుమారు రెండు రోజుల తర్వాత మళ్లీ భారత్ లో అడుగుపెట్టాడు. వాఘా బోర్డర్లో అతడికి భారతీయులు ఘనస్వాగతం పలికారు. పాకిస్థాన్‌లో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో త్వరలో బయటకు రావొచ్చు. పాక్ ఆర్మీకి చిక్కడంతో అభినందన్‌కు కొన్ని పరీక్షలైతే తప్పనిసరిగా నిర్వహించాలి. శత్రు దేశానికి చిక్కిన వారు తిరిగి మాతృభూమికి చేరుకున్నప్పుడు కచ్చితంగా కొన్ని నియమ నిబంధనలైతే పాటిస్తారు.వింగ్ కమాండర్ మానసిక స్థితి ఎలా ఉందో అందుకు సంబంధించిన కొన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా శత్రు దేశం ఆయన దుస్తుల్లో కానీ, శరీర భాగాల్లో కానీ ఏమైనా బగ్‌లు.. ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చిందేమోనన్న అనుమానం తీర్చకోవడానికి శరీరం మొత్తం బగ్ స్కాన్ చేస్తారు.ఇలా కొన్ని పరీక్షల అనంతరం అతను తిరిగి సైన్యంలో చేరతాడా,లేదా ... అందుకు అతను అర్హుడా కాదా అన్నది. ఇంకా తెలవలసి ఉంది.
* మొదట అభినందన్‌ను నేరుగా భారత వాయుసేన ఇంటెలిజెన్స్ యూనిట్‌కు అప్పగిస్తారు.ఆ తరువాత తమ తదుపరి పరీక్షలు మొదలు పెడతారు.
* . అతడి ఫిట్నెస్ పై మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు.
* శత్రు దేశం వారి ఆధీనంలో ఉన్నప్పుడు అతని శరీర కేంద్రంగా ఏమైనా బగ్‌లు,ఎలక్ట్రానిక్ పరికరాలు ఏర్పాటు చేసిందా అనేది తెలుసుకోవడానికి బాడీ మొత్తం స్కాన్ చేస్తారు.
*సైకలాజికల్ టెస్టులు కూడా నిర్వహిస్తారు. శత్రువుల చేతికి చిక్కిన వ్యక్తి కావడం.ప్రత్యర్థి దేశ రక్షణ రహస్యాలను తెలుసుకోవడానికి హింస పెడతారు . గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తారు.. భారత్‌కు సంబంధించిన సీక్రెట్లను ఏవైనా అడిగారా...? అనే కోణంలో విచారణ జరుపుతారు.
* ఈ పరీక్షల తరువాత ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అనాలసిస్ వింగ్ అధికారులు కూడా అభినందన్‌ను క్షుణ్నంగా విచారిస్తారు
*ఇలాంటి పరీక్షలన్నీ కేవలం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విషయంలోనే కాదు . కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ చేతికి చిక్కిన పైలెట్ కంభంపాటి నచికేత విషయంలో కూడా ఇలాంటి పద్ధతులను అవలంభించారు అవలంభిస్తారని సైన్యాధికారులు చెబుతున్నారు.