ఆదివారం జరగనున్న ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్స్ కి పాకిస్థాన్ జట్టుకి ఆ దేశ మాజీ ఆటగాళ్లు పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఆ లిస్ట్ లో పాక్ మాజీ సారథి ఇమ్రాన్ ఖాన్ కూడా చేరిపోయాడు. ఫైనల్లో పాక్ టాస్ గెలిస్తే భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించొద్దని ఇమ్రాన్ ఖాన్ సూచిస్తున్నాడు. బ్యాటింగ్ లైనప్‌లో బలంగా భారత్ ను పొరపాటున కూడా బ్యాటింగ్‌కి ఆహ్వానించొద్దు... ఆలా చేస్తే వారు భారీ స్కోరు సాధిస్తారు. దీంతో పాక్‌పై ఒత్తిడి రెట్టింపవుతుంది.
పాక్ బలం బౌలింగ్ కాబట్టి తొలుత బ్యాటింగ్ చేపడితే ఆ తర్వాత ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను కట్టడి చేసే అవకాశముంది. టోర్నీలో భాగంగా లీగ్‌లో భారత్ చేతిలో ఓడాం. అదే టోర్నీలో ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. సెమీఫైనల్లో బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో ఏ విధంగా సత్తా చాటి ఇంగ్లాండ్‌పై విజయం సాధించారో.. ఫైనల్లోనూ అదే ప్రదర్శన కొనసాగించి భారత్ పై విజయం సాధించాలని కోరాడు.