//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పీసీబీ నూతన చైర్మన్ గా నజమ్ సేథీ

Category : sports

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నూతన చైర్మన్ గా నజమ్ సేథీ ఎంపికయ్యారు. ప్రస్తుత చైర్మన్ షహర్యార్ ఖాన్ ఆ పదవిలో కొనసాగని చెప్పడంతో, ఎగ్జిక్యూటివ్ చీఫ్ గా పని చేస్తున్న నజమ్ సేథీని గురువారం చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ మేరకు వార్షిక సర్వసభ్య సమావేశంలో సేథీ ఎంపికకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. కానీ షహర్యార్ ఆగస్టు నెలవరకూ చైర్మన్ గా కొనసాగనున్నారు. ఆ తరువాతే నజమ్ సేథీ పీసీబీ చైర్మన్ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. షహర్యార్ తరహాలోనే సేథీ కూడా పాకిస్తాన్ క్రికెట్ ను అభ్యున్నతిలో నడిపిస్తారని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది.