ఇప్పటివరకు ఇండియా లో ఒక్క క్రికెట్ కి మాత్రమే ఆదరణ లభిస్తుండేది, కానీ ఇప్పుడిప్పుడే ఇండియా లో కూడా ఈ ధోరణి మారుతుంది. ఇండియా లో కూడా హాకీ, ఫుట్ బాల్, కబ్బడ్డి కి కూడా మంచి ఆదరణ లభిస్తుంది.
కబడ్డీ మాస్టర్స్చాంపియన్షిప్ ఆరంభ మ్యాచ్‌లో భారత్ దాయాది పాకిస్థాన్‌ను చిత్తుచేసి శుభా రంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 35- 20పాయిట్లతో ఆలవోకగా నెగ్గింది.భారత్ ఆల్‌రౌండర్ ప్రతిభతో పాకిస్థాన్‌ను బెంబేలెత్తించింది.
దీంతో ఏదశలోను పాక్ కోలుకోలేక తలవొ గ్గింది.ఆట ప్రారంభలోనే అజయ్ ఠాకూర్ రైడింగ్‌లో పాయింట్ సాధించి 1-0 ఆధిక్యంలో నిలిపాడు.అయితే మరో క్షణంలోనే పాకిస్థాన్ బోనస్ పాయింట్‌తో స్కోరును 1-1గా సమం చేసింది. ఈనేపథ్యంలో పుంజుకున్న అజయ్ రైడింగ్‌లో విజృంభించడంతో భారత్ 4-3 ఆధిక్యం పొందింది. అయితే ఒక్కసారిగా భారతరైడర్లు దూకుడు ప్రదర్శించడంతో పాకిస్థాన్ ఆలౌట యింది.దాంతో 9-7 పాయింట్ల ఆధి క్యం పొందింది.రొహిత్ ఏకంగా 4 పాయింట్లు సాధించడంతో స్కోరు ఒక్కసారిగా 14-8కి చేసింది.ఆత్మరక్షణలో పడ్డ పాకిస్థాన్‌ను ప్రథమార్థం ముగిసేలోపు రెండు సా ర్లు ఆలౌట్‌చేసి 22-9 పాయింట్లతో నిలి చింది.
ద్వితీయార్థంలో అజయ్ ఠాకూర్ మరోసారి విజృంభించడంతో పాకిస్థాన్ మూడో సారి ఆలౌటయింది.అజయ్, రాహుల్,రోహిత్ పోటీపడి రైడింగ్‌లో పాయింట్లు సాధించడంతో భారత్ భారీ ఒక దశలో 35-20స్కోరు ఆధిక్యంలో నిలిచింది.