పాకిస్తాన్ పట్టుకున్న వింగ్ కమాండర్ అభినందన్ ను జనీవా ఒప్పందం ప్రకారం విడుదల చెయ్యాల్సి వున్నా , పాకిస్తాన్ చాలా త్వరగా అభినందన్ ను భారత్ కు పంపే నిర్ణయం తీసుకుంది . అది భారత్ ఊహించని నిర్ణయం అయితే మరో సంచలన విషయం కూడా చెప్పింది పాకిస్తాన్ .
పాకిస్తాన్ మరో సంచలన ప్రకటన చేసింది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమదేశంలోనే ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి తెలిపారు. అయితే మసూద్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. అయితే పుల్వామా ఘటనపై ఆధారాలు లభిస్తే మసూద్‌ను కోర్టులో హాజరుపరుస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్ దగ్గర ఆధారాలుంటే తమకివ్వాలని విదేశాంగ మంత్రి తెలిపారు. ఆధారాలుంటే అజహార్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.