//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎల్వోసీ వద్ద పాక్ కాల్పులు

Category : national

పాకిస్థాన్ మళ్లీ మళ్లీ కాల్పుల విమరణ ఉల్లంఘనకు పాల్పడుతున్నది. తాజాగా పూంచ్‌లోని కేజీ సెక్టార్‌లో పాక్ కాల్పులు జరుపుతున్నది. దీంతో జమ్మూకశ్మీర్‌లోని ఎల్వోసీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. గురువారం కూడా కృష్ణఘాటీ సెక్టార్ వద్ద పాక్ కాల్పులకు తెగించింది. ఆ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్‌తో పాటు మరో వ్యక్తి మృతిచెందాడు. మోర్టార్ షెల్లింగ్ వల్ల మరో ఆరు మంది సైనికులు కూడా గాయపడ్డారు. ప్రకాశం జిల్లాకు చెందిన సిపాయ్ టీకే రెడ్డి కూడా ఇదే కాల్పుల్లో మృతిచెందాడు. స్మాల్ ఆర్మ్స్, ఆటోమెటిక్స్‌తో పాక్ పదేపదే విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆ కాల్పులకు దీటుగా జవాబు ఇస్తున్నట్లు కూడా మన ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

గత నెల రోజుల్లో పాక్ కాల్పుల వల్ల ఆరుగురు మృతిచెందగా, మరో డజన మందికిపైగా గాయపడ్డారు. గత రెండు నెలల్లో పాక్ బోర్డర్‌లో సుమారు 50 సార్లు చొరబాటు ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే అందులో 44 ఘటనలను ఆర్మీ తిప్పికొట్టింది. భారీగా జరుగుతున్న షెల్లింగ్ వల్ల స్థానికంగా రెసిడెన్షియల్ ఇండ్లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఎల్వోసీ వద్ద ఉన్న ఉద్రిక్తత కారణంగా పూంచ్-రావల్‌కోట్ మార్గంలో ఉన్న రోడ్డును మూసివేశారు.