//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీకి పాటీదార్ నేత రాజీనామా..

Category : national

సరిగ్గా 15 రోజుల క్రితం బీజేపీలో చేరిన పాటీదార్ నేత నిఖిల్ సవానీ తాజాగా బీజేపీకి రాజీనామా చేశారు. ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన ఆయన ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తనకు, హార్దిక్‌కు మధ్య మతంలో తేడాలున్నాయేమోమోగానీ, మనసులలో వైరాలు లేవన్నారు. తాను పాటీదార్ సమాజం కోసం పనిచేస్తున్నాను. అలాగే పాటీదార్ల సంక్షేమం కోసం బీజేపీ పాటుపడుతున్నట్టు చెప్పుకుంటోంది. అయితే పాటీదార్లను బీజేపీ కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకోవాలని చూస్తున్నదని సవానీ ఆరోపించారు. పాటీదార్లను కోట్ల రూపాయలకు కొనుగోలు చేయాలని బీజేపీతో పాటు మోదీ భావిస్తున్నారని, ఇది నచ్చకే పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు.బీజేపీ పాటీదార్లను అమాయకులను చేసి ఆడుకోవాలని భావిస్తోందన్నారు.హార్దిక్ పటేల్ చేస్తున్న ఉద్యమం సరైనదే! అందుకే హార్దిక్ పటేల్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు రాహుల్ గాంధీని కలవాలనుకుంటున్నానని సవానీ ప్రకటించారు. కాగా ఇటీవలే బీజేపీలో చేరిన నరేంద్ర పటేల్.. తాను పార్టీలో తాను చేరినందుకు బీజేపీ కోటిరూపాయల ఆఫర్ ఇచ్చిందని ప్రకటించారు. ఇందులో రూ. 10 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చిందని మిగిలిన 90 లక్షలు సోమవారం అందజేస్తుందని తెలిపారు. ఈ పరిణామానికి కలత చెందిన నిఖిల్ సవానీ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.