//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పద్మశ్రీ అవార్డు గ్రహితలు వీరే...!

Category : national

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2018కి చెందిన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నేడు(గురువారం)ప్రకటించింది.వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందించింది.మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్త అరవింద్‌ గుప్తాకు,కేరళకు చెందిన లక్ష్మీకుట్టికి,ఎం.ఆర్‌ రాజగోపాల్‌కు, కర్ణాటకకు చెందిన సలగత్తి నరసమ్మకు,హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన యేషి ధోడెన్‌కు వైద్యరంగంలో పద్మశ్రీని కేంద్రం ప్రకటించింది.

అదేవిధంగా మధ్యప్రదేశ్‌కు చెందిన భజ్జు శ్యామ్‌కు కళారంగంలో పద్మశ్రీ ఇవ్వనున్నట్టు పేర్కొంది.బెంగాల్‌కు చెందిన సుధాన్షు బిశ్వాస్‌కు సేవారంగంలో, బెంగాల్‌కు చెందిన సుభాషిని మిస్త్రీకి సామాజిక సేవలో,సాహిత్య రంగంలో విజయలక్ష్మీకి పద్మశ్రీని అందించనున్నారు.

తమిళనాడుకు చెందిన రాజగోపాలన్‌ వాసుదేవన్‌కు, మహారాష్ట్రకు చెందిన మురళీకాంత్‌ పటేకర్‌ పద్మశ్రీని ప్రకటించింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. మరికాసేపట్లో పద్మ అవార్డులపై కేంద్రం అధికారిక ప్రకటన చేయనుంది.