యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం
"పడి పడి లేచే మనసు". రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. కోల్కత బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విభిన్న పాత్రలతో ఆకట్టుకునే శర్వానంద్ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రం యూనిట్.
ఈ టీజర్ చూస్తుంటే ఇది ఒక అందమైన ప్రేమకథ అని తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి, శర్వానంద్ నటన, స్క్రీన్ ప్లే చూస్తుంటే ప్రేక్షకులు ఫిదా అవ్వాలిసిందే. ఈ సినిమా చాల రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు చిత్ర యూనిట్.