భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ సిల్వర్ మెడల్ గ్రహీత పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల బరిలో నిలిచింది. ఈ కమిషన్లో ఖాళీ అయ్యే నాలుగు స్థానాల కోసం సింధుతో పాటు మరో ఎనిమిది మంది పోటీపడుతున్నారు. భారత్ నుంచి అంతగా పరిచయం లేని భారత షట్లర్ నిఖార్ గార్గ్ కూడా ఉన్నాడు. క్రీడా సమాఖ్య ప్రమేయం లేకుండా అంతర్జాతీయ టోర్నీల్లో క్రీడాకారులు నేరుగా ఎంట్రీలు నమోదు చేసుకునేలా నిబంధనలు మార్చాలంటూ నిరుడు మేలో నిఖర్ బీడబ్ల్యూఎఫ్లో ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేశాడు. మార్చి 27న నామినేషన్ల గడువు ముగియగా బీడబ్ల్యూఎ్ఫలో ఆటగాళ్లకు ప్రాతినిథ్యం వహించే కమిషన్లో చోటు కోసం ఆరుగురు పు రుషులు, ముగ్గురు మహిళలు ఎన్నికల బరిలో నిలిచారు. నిబంధనల ప్రకారం ఇందులో ఒక మహిళ, ఒక పురుషుడు ఉండాలి. మూడో వ్యక్తి ఎవరైనా కావొచ్చు. 9 మందిలో నలుగురుని ఎన్నుకుంటారు. ఈ కమిషన్ బీడబ్ల్యూఎఫ్లో క్రీడాకారులకు ప్రాతినిధ్యం వహిస్తుంది.