//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పందెం కోళ్ళ కి మరణ శిక్ష : ఆ కోళ్ళను పట్టుకొచ్చిన పోలీసులు.. ఏమి చేశారంటే..!

Category : world

సంక్రాంతి వస్తోంది కదా.. అప్పుడే మనవాళ్ళు కోళ్ళ పందేలకు సన్నాహకాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అలాంటప్పుడు పోలీసులు కోళ్ళను ఎందుకు పట్టుకొని వస్తారనే కదా మీ అనుమానం. ఈ ఘటన ఇక్కడిది కాదు కంబోడియాలోనిది. కంబోడియాలో కూడా కోళ్ళ పందేలు బాగా ఫేమస్.. తాజాగా అక్కడ పోలీసులు చేసిన రైడింగ్ లో అనుమతి లేకుండా కోళ్ళ పందేలను నిర్వహిస్తూ ఉండడం తెలిసి వాటిని పట్టుకొని వచ్చారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 92 కోళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ విషయాన్ని పోలీసులు కోర్టు దాకా తీసుకొని వెళ్ళడంతో కోర్టు ఆ కోళ్ళకు మరణశిక్ష విధించింది. దీంతో ఆ కోళ్ళను పోలీసులే చంపి.. వండుకొని తిన్నారు. డిసెంబర్ 4న పోలీసులు ఆ కోళ్ళను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుండి వాళ్ళు వాటిని లాకప్ లో ఉంచి చూసుకున్నారు.

గురువారం నాడు వాటికి మరణశిక్ష విధించాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో వాటిని చంపి.. వండుకొని తిన్నారు. దీనిపై నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కోళ్ళకు మరణశిక్ష ఎందుకు.. వాటిని పెంచిన ఓనర్లను.. కోళ్ళ పందేలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు కఠిన శిక్షలు విధించండి అని పలువురు కోరుతున్నారు. థాయ్ ఫానీ అనే వ్యక్తిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు.

Related News