//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గ్రూప్‌ దశలోనే ఛాంపియన్‌ ఔట్‌.........ఫిఫా నుండి జర్మనీ అవుట్..!

Category : sports

నాలుగు సార్లు ఆ జట్టు కప్పును అందుకుంది..గత టోర్నీలో మెస్సీ ఆశలను చిదిమేస్తూ.. అర్జెంటీనాను ఓడిస్తూ విశ్వ విజేతగా నిలిచింది..ఐదోసారి కప్పు నెగ్గి బ్రెజిల్‌ సరసన నిలవాలని ఆశిస్తూ.. టైటిల్‌ నిలబెట్టుకోవాలని కాంక్షిస్తూ.. ఫేవరెట్‌గా.. నెంబర్‌ వన్‌ హోదాలో బరిలోకి దిగింది..

ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన జర్మనీకి ఆదిలోనే షాక్ తగిలింది. మెక్సికోతో పరాజయం పొందినా అనంతరం స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి విజయం సాధించడంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ నిన్న జరిగిన దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలయింది. దక్షిణకొరియా ఏకంగా 2 గోల్స్‌ కొట్టగా జర్మనీ ఒక్క గోల్‌సాధించలేకపోయింది. దీంతో పాయింట్ల జాబితాలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న జర్మీనీ నాకౌట్‌దశకు వెళ్లకుండా ఇంటి ముఖం పట్టింది.

నాలుగుసార్లు విజేతగా నిలిచిన జర్మనీ ఈ టోర్నీలో లీగ్‌ దశలోనే తప్పుకోవడం సంచలనమైంది. టైటిల్‌ ఫేవరేట్‌గా టోర్నీకి వచ్చిన జర్మనీ పేలవమైన ఆట తీరు ప్రదర్శించింది. దీనితో జర్మన్ అభిమానులు తీవ్రమైన శోకం లో మునిగిపోయారు.