//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒంటిమిట్ట పుణ్యక్షేత్ర విశిష్టతలు...!

Category : history editorial

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట లోని కోదండరామాలయం ప్రాచీనమైన మరియు విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు,సీతాదేవి,,లక్ష్మణస్వామి. ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన ఒక మండలము కడప నుండి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27km దూరంలో ఉంది. ఈక్షేత్రము ఏకశిలా నగరము అని ప్రసిద్ధి చెందినది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా విడవడీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో ఈ అలయమును ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచినది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను తలంబ్రాలను ఈ ఆలయానికి సమర్పిస్తారు.

అలయ చరిత్ర .... ::

ఇక్కడ ఉన్న కోదండరామాలయం లోని విగ్రహాన్నిజాంబవంతుడు ప్రతిష్ఠించాడు ఒకేశిలలో, శ్రీరాముని,సీతను,లక్ష్మణుని, ఇక్కడ చూడవచ్చు ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థలపూరాణంలో వివరించబడింది గోపుర నిర్మాణము చోళశిల్ప సాంప్రదాయంలో అద్భుతంగా ఉంటుంది ఫ్రెంచ్ యాత్రికుడు " టావెర్నియర్ " 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని కీర్తించాడు.

ఆంధ్ర మహభాగవతాన్ని రచించిన "పోతన" తాను ఏకశిలాపురి వాసినని చెప్పుకున్నాడు అంతేగాక తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం గావించాడు దాన్నిబట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండటాన్ని బట్టి అయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు

స్థలపూరాణం ;

రామ లక్ష్మణులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగ రక్షణకు తీసుకున్నాడని తెలిసిందే కాని సీతారామకళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది అప్పుడు మృకుడు మహర్షి, శృంగిమహర్షి, రాముని ప్రార్ధించడంతో దుష్టశిక్షణ కోసం అస్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబులపొది, పిడిబాకు,కోదండం,

పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేసాడని పురాణం చెబుతుంది అందుకు ప్రతిగా అ మహర్షులు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశీలగా చెక్కించారని తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠ చేశాడని ఇక్కడ ప్రజల విశ్వాసం.

అలయ విశేషాలు.....

ఈ ఆలయంలోని ప్రదాన విగ్రహం యొక్క ఒకే శిలలో శ్రీరామ,సీత,లక్ష్మణ,విగ్రహాలు చెక్కబడ్డాయి దేవాలయాలలోని మూల విగ్రహంలో రాముని విగ్రహం ప్రక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే శ్రీరామ హనుమంతుడు కలవక ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల విగ్రహం స్థాపించినట్లు కధనం ఈ కోదండరామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి విశాలమైన అవరణముంది అలయ ముఖ ద్వారం ఎత్తు సుమారు 160 అడుగుల 32 అడుగుల వెడల్పు శిలా స్తంభాలతో రంగ మండపం నిర్మింపబడినది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మింపబడినాయి.

రంగ మండపం విజయనగర రాజులు, మట్టిరాజులు ఈ ఆలయాన్ని మూడు దశలగా నిర్మించారు ఆంధ్ర వాల్మికి వావిలి కొలను సుబ్బారావు ( 1863-1936 ) .ఈ రామాలయాన్ని పునర్ధించాడు స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామాసేవ కుటిరాన్ని నిర్మించాడు ఈయన టెంకాయ చిప్ప చేతపట్టుకొని భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షలు రూపాయలు విలువయిన ఆభరణాలు చేయించగలిగాడు.

పోతన అయ్యంరాజు రామభద్రుడు ఉప్పుగుండురు వెంకటకవి వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేసారు వావిలికొలను సుబ్బారావు వాల్మికి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి "మందరం" అనిపేరు వ్యాఖ్యానం కూడా వ్రాశాడు గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది ఈ దేవాలయం ప్రక్కగారథశాల-రథం ఉన్నాయి చోళ విజయనగర వాస్తుశైలులు కనిపించే ఈ అలయ స్తంభాలపై రామాయణ భాగవత కథలను చూడవచ్చు.

ప్రతిఏటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తారు ప్రశాంత వాతవరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తాయి ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను అకర్శించే అంశాలలో ఇమాంబేగ్ బావి ఒకటి ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్‌ నభీఖాన్ ప్రతినిధి ఒకసారి అయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీదేవుడు పిలిస్తే పలుకుతాడ.. అని ప్రశ్నించాడు చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా అయన మూడుసార్లు ఓ అని సమాధానం వచ్చింది.

అయన అశ్చర్యచకితుడయ్యాడు స్వామి భక్తుడిగా మారిపోయాడు అక్కడ నీటి అవసరాల కొరకు ఒకబావిని తవ్వించడం జరిగింది. అయన పేరుమీద గానే ఈబావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎందరో ముస్లింలు కూడా ఈ అలయాన్ని దర్శించుకొవడం ఇక్కడి విశేషం పుట్టపర్తికి వచ్చే ఎంతోమంది విదేశీయులు కూడా ఈ అలయ సందర్శన కోసం ఇక్కడికి విచ్చేస్తుంటారు అలయ శిల్పసంపద చూసి ముచ్చట పడిపోతుంటారు.