//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐపీల్ ను ఘనంగా ఆరంభించిన ఆరెంజ్ ఆర్మీ....!

Category : sports

ఐపీల్ సీజన్–11లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఘనం గా తన రాకను చాటిచెప్పింది. రాత్రి హైదరాబాద్ లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ లో ఆరెంజ్ ఆర్మీ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎప్పటికి ఆరెంజ్ ఆర్మీ బలం బౌలింగ్ అని మరో సారి సన్‌ రైజర్స్‌బౌలర్లు నిరూపించారు.

మొదటగా టాస్‌ గెలిచిన సన్ రైజర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు బ్యాటింగ్ కు దిగింది. బౌలర్లను మార్చడం లోను , బౌలర్లకు అనుగుణంగా ఫీల్డర్లను సెట్ చేయడం లోను కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందరిని ఆకట్టుకున్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ వార్నర్ లేని లోటును విలియమ్సన్ భర్తీ చేసాడు. మెరుపువేగంతో మ్యాచ్ మొదట్లో ఒక రనౌట్ కూడా చేసి అభిమానులను ఔరా అనిపించాడు. సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. సంజు శామ్సన్‌ (49) ఒంటరిపోరాటంతో ఆ జట్టు ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ సాహా(5) వికెట్ కోల్పోయింది. రహానే ఇచ్చిన లైఫ్ ను వినియోగించుకున్న ధావన్ (77) ధాటిగా ఆడగా, అతనికి జత కలిసిన విలియమ్సన్ (36) నిలకడ ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ జట్టు కేవలం 15.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 127 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.