//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆర్డినెన్స్‌కు వ్యతిరేకత దెబ్బకు దిగివచ్చిన ప్రభుత్వం

Category : national

రాజస్థాన్ ప్రభుత్వం మీడియా నోరు నొక్కుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై వెనక్కి తగ్గుతోంది. విమర్శల జడివాన కురవడంతో బిల్లు ప్రభుత్వం సెలక్ట్ కమిటీకి పంపించింది. బిల్లులోని వివాదాస్పద అంశాలను కమిటీ పరిశీలిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లు ఆమోదం పొందితే అధికారులు, న్యాయమూర్తులు, మాజీ జడ్జీలు, చట్ట సభ్యులైన ఎలాంటి ఆరోపణలు వచ్చినా ప్రభుత్వ అనుమతి లేకుండా పేపర్లలో రాయకూడదు. టీవీల్లో ప్రసారం చేయకూడదు. మొత్తంగా చెప్పాలంటే అసలు వారిపై ఆరోపణలు చేయకూడదు. ప్రభుత్వ అనుమతి ఉంటేనే వారిపై విచారణ జరపాలి. లేకపోతే రెండేళ్ల జైలు శిక్ష తప్పదు. ఈ ఆర్డినెన్స్‌ను బిల్లుగా రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

దీనిపై కాంగ్రెస్ భగ్గుమంది. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు బయలుదేరిన సచిన్ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై వీథి పోరాటాలకు కూడా సిద్ధమని, అవినీతిని వ్యవస్థీకృతం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మరోవైపు రాజస్థాన్ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఒక న్యాయవాది రాజస్థాన్ హైకోర్టులో పిల్ వేశారు. మీడియాను నిషేధించడమంటే సుప్రీం కోర్టు నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు.