Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒప్పో రియల్ మి2 అప్ గ్రేడెడ్ వర్షన్ రియల్ మి 3 .. అందుబాటు ధర, అదిరిపోయే ఫీచర్లు

Category : technology

స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక భాగస్వామిగా మారిపోయింది . దీంతో స్మార్ట్ ఫోన్ మేకర్స్ పోటీపడి తమ ప్రొడక్ట్ లను మార్కెట్లలోకి విడుదల చేస్తున్నారు. ఇటీవల శాంసంగ్, ఎల్ జీ, జియోమీ, నోకియా హెచ్ఎండీ గ్లోబల్ ఇలా ఎన్నో మొబైల్ తయారీ దారు సంస్థలు తమ కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే ఫీచర్లతో విడుదల చేస్తున్నాయి. యూజర్లను ఆకట్టుకునేందుకు ఫోల్డబుల్ ఫోన్లను సైతం ఎండబ్ల్యూసీ ఈవెంట్ లో ప్రదర్శించాయి. ఇప్పుడు ఒప్పో మొబైల్ తయారీ కంపెనీ అందిస్తోన్న ఫోర్త్ ప్లాగ్ షిప్ హ్యాండ్ సెట్ రియల్ మి 3 సోమవారం (మార్చి 4, 2019) ఇండియన్ మార్కెట్లలో విడుదలైంది.

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మధ్యాహ్నం 12:30 గంటలకు రియల్ మి3 కొత్త స్మార్ట్ ఫోన్ ను ఒప్పో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కు సంబంధించి ఫీచర్ వివరాలన్నీ ఆన్ లైన్ షాపింగ్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, రియల్ మి అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. రియల్ మీ 3 లాంచింగ్ లైవ్ స్ట్రీమింగ్ ను కంపెనీ యూట్యూబ్, ఫేస్ బుక్ పేజీల్లో ఒప్పో విడుదల చేసింది. ఇండియా మార్కెట్లలో విడుదలైన జియోమీ రెడ్ మీ నోట్ 7, రెడ్ మి నోట్ 7 ప్రొ స్మార్ట్ ఫోన్లకు ధీటుగా ఒప్పో రియల్ మి3 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

రియల్ మి3 తో పాటు రియల్ మి3 ప్రొ స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేయనుంది. రియల్ మి 3 ప్రొ స్మార్ట్ ఫోన్లో పవర్ ఫుల్ చిప్ సెట్, స్నాప్ డ్రాగన్ 600 సిరీస్ చిప్ ఉండనుంది. అంతేకాదు.. రియల్ మి 3 ప్రోలో ట్రిపుల్ కెమెరాలు, బ్యాక్ సైడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉండనున్నాయి. 3జీబీ ర్యామ్‌,32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ. 8వేల 999 ఉండగా, 4జీబీ RAM + 32 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10వేల 999 వరకు ధర నిర్ణయించారు. ఈ ఏడాది విడుదల ఒప్పో లాంచ్ చేసిన రియల్ మి3 అపగ్రేడెడ్ వర్షన్.

మీడియాటెక్ హెలియో పీ70ఎస్ఒసీ, 8 కోర్ ప్రాసిసెర్ కలిగి 4,230 ఎంఎహెచ్ బ్యాటరీ, రియల్ మి ఇంటర్ ఫేస్ ఉంటుంది.

CPU ఫ్రీక్వెన్సీ 2.1 జీహెచ్ జెడ్ కాగా 3డీ యూనిబాడీ గ్రేడియంట్ డిజైన్ కలిగి 6.2 ఇంచెస్‌ హెచ్‌డీ డిస్‌ప్లే తో చూడటానికి స్మార్ట్ గా ఉంటుంది. 1520x72 రిజల్యూషన్‌ మోడ్, డ్యుయల్ రియర్ కెమెరాలు 13+2ఎంపీ రియర్ కెమెరా తో

హెలియో పీ60 కంటే 13% సూపర్ ఫాస్ట్ గా పని చేస్తుంది. స్టోరేజీ, మెమెరీ వేరియంట్లు 3+32 GB, 4+64GB గా వుంది.

డైమండ్ కట్ డిజైన్, డ్రాప్ నాచ్ , గ్లిటరీ బ్యాక్, ట్రెడిషనల్ డైమండ్ కట్ బ్యాక్, ColorOS 6.0, ఆండ్రాయిడ్ 9 పై ఈ మొబైల్ స్పెసిఫికేషన్లు .