//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అదిరిపోయే ఫీచర్లతో ఒప్పో A83 ...

Category : business

తక్కువ బడ్జెట్ లో సెల్ఫీ కెమెరా లను అదించటంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నఒప్పో సంస్థ కొత్తగా OPPO A83 పేరుతో సరికొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది.రూ.13,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోన్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకించి ఆఫ్‌లైన్ స్టోర్‌లలో మాత్రమే లభ్యమవుతోంది.

ఒప్పో ఏ83 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన కెమెరాలతో ప్యాక్ అయి ఉంది.ఈ కెమెరాలో పొందుపరించిన కాంప్లెక్స్ అల్గారిథమ్ ఫోటోను క్లిక్ చేస్తున్నది ఎవరో కూడా గుర్తించగలుగుతుంది. ఇదే సమయంలో ఈ కెమెరాలోని ఫెమినైన్ ఎన్‌హాన్స్‌మెంట్స్.. మేల్ సబ్జెట్స్ అలానే ఫిమేల్స్ సబ్జెక్ట్స్ మధ్య తేడాలను గుర్తించి వారి వయసును బట్టి ఎఫెక్ట్స్‌ను అద్దుతుంది.

ఒప్పో తన OPPO A83 డివైస్‌ను 18:9 యాస్పెక్ట్ రేషియో స్ర్కీన్‌తో ప్రపంచానికి పరిచయం చేసింది. OPPO A83 స్మార్ట్‌ఫోన్‌కు ఫేషియల్ అన్‌లాక్ ఫీచర్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది.ఈ సూపర్ హై-స్పీడ్ టెక్నాలజీ కేవలం 0.4 సెకన్ల వ్యవధిలో ఫోన్‌ను అన్‌లాక్ చేయగలుగుతుంది.

ఏ83 స్మార్ట్‌ఫోన్‌ 2.5GHz మీడియాటెక్ 6763T ఆక్టా-కోర్ సీపీయూ పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌కు జతచేసిన 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌ను ఆఫర్ చేయగలగుతుంది.ఈ డివైస్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.ఒప్పో ఏ83 స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన 3,180mAh బ్యాటరీతో వస్తోంది