//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆప‌రేష‌న్ గ‌రుడ.. తాజా అప్‌డేట్‌..!

Category : politics

ఏపీలో బీజేపీ, వైసీపీ, జ‌న‌సేన పార్టీల అధినేతల‌ ల‌క్ష్యం ఒక్క‌టే. సీఎం చంద్ర‌బాబు. ఎలాగైనా స‌రే, ఆఖ‌రికి బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌తో పొత్తు పెట్టుకోనైనా స‌రే సీఎం ప‌ద‌విని ద‌క్కించుకోవాల‌ని వైఎస్ జ‌గ‌న్ త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. నీకెందుకు నేను మ‌ద్ద‌తు ఇవ్వాలి..? నేను సీఎం అవ్వ‌కూడ‌దా..? అనే రీతిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రంగంలోకి దిగి ముమ్మ‌రంగా ప్ర‌చారం చేస్తున్నారు. మీరెన్ని పాట్లైనా ప‌డండి. కావాలంటే డ‌బ్బులు తీసుకోండి.. కేసులు కొట్టివేయించుకోండి.. మాకు మాత్రం 2019ఎన్నిక‌ల్లో కొన్ని సీట్ల‌నైనా గెలుచుకునేందుకు స‌హ‌క‌రించండి అంటూ బీజేపీ నేత‌లు వైసీపీ, జ‌న‌సేన పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలుపుతోంది.

ప్ర‌త్యేక హోదా విష‌యంలో త‌మ‌కు ఎదురు తిరిగాడ‌నే కోపంతో సీఎం చంద్ర‌బాబుపై బీజేపీ నేత‌లు ఆప‌రేష‌న్ గ‌రుడ ప్లాన్‌ను అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా కొంద‌రు ఇప్ప‌టికే టీడీపీపై విష ప్ర‌చారం చేయ‌డంతో పాటు.. సీఎం చంద్ర‌బాబుపై తిరుగుబావుటా ఎగుర‌వేశారు. ఉండ‌వ‌ల్లి, ముద్ర‌గ‌డ‌, జ‌గ‌న్‌, ప‌వ‌న్ క‌ళ్యాన్‌, ర‌మ‌ణ దీక్షితులు, మోత్కుప‌ల్లి ఇలా ఒక్క‌క్క‌రుగా ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో భాగంగా మీడియా ముందుకు వ‌స్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి ఇటీవ‌ల మోత్కుప‌ల్లిని క‌లిశారు. ఆ విష‌యం తెలుసుకున్న మీడియా వెంట‌నే అక్క‌డ‌కు వెళ్ల‌డంతో విజ‌య‌సాయిరెడ్డి వెనుతిరిగారు .ఏదేమైనా వైసీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి ఏపీ సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యంగా ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో అస‌త్యాల‌ను ప్ర‌చారం చేయ‌డం స‌రికాద‌ని ఏపీ ప్ర‌జ‌లు వ్యాఖ్యానిస్తున్నారు.